జాతీయ వార్తలు

హైదరాబాద్‌కు సీఈసీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల నిర్వహణ సంసిద్ధత గురించి అధ్యయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీనియర్ అధికారుల బృందం తెలంగాణకు వెళుతుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా అధ్యక్షతన సీనియర్ అధికారుల బృందం ఈనెల 11 తేదీ మంగళవారం హైదరాబాదుకు వెళుతుంది.
ఈ బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను అధ్యయనం చేసిన అనంతరం ఎన్నికల సంఘం ప్రధానాధికారి రావత్‌కు నివేదిక అందిస్తుంది. దాని ఆధారంగా ఎన్నికల షెడ్యూలును తయారు చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.