జాతీయ వార్తలు

ఆ అధికారం గవర్నర్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఏడుగురు దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం తమిళనాడు గవర్నర్‌కు లేదని న్యాయ నిపుణులు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడుగురిని జైలు నుండి వదిలేయాలని కోరుతూ గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ఈ మేరకు మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసిందని, కేంద్రాన్ని గవర్నర్ సంప్రదించాల్సి ఉంటుందని న్యాయ కోవిదులంటున్నారు. రాజీవ్ హత్య కేసును సీబీఐ దర్యాప్తుచేసింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా జరుగుతోందని, వివిధ దేశాల నుంచి హత్య కేసు వెనక దాగి ఉన్న కారణాలపై డాక్యుమెంట్లు రావాల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం సీఆర్‌పీసీ 1973లో సెక్షన్ 435 నిబంధన కింద కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులంటున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడు ప్రభుత్వం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌దాఖలు చేసింది. కాని ఆ పిటిషన్‌ను కేంద్రం వ్యతిరేకించింది. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో గవర్నర్ ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించే హక్కు ఉండదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్నదని న్యాయ వాదులంటున్నారు. కేంద్రపరిధిలోని హక్కులపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేరంటున్నారు. ఈ ఏడాది మే 21వ తేదీన కేసు దర్యాప్తులో ఉందని, వివిధదేశాలనుంచి డాక్యుమెంట్లను సేకరిస్తున్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏడుగురు దోషులను వదిలిపెట్టే అధికారం గవర్నర్‌కు ఉండదని న్యాయవర్గాలు తెలిపాయి.
దివంగత మాజీ ప్రధాని 1991 మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో హత్యకు గురైన విషయం విదితమే. ఈ హత్య కేసులో దిగువ కోర్టు 26 మందికి మరణశిక్షను విధించగా, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నలుగురికి మాత్రమే ఉరిశిక్షను ఖరారు చేసింది. కేంద్రం వద్ద క్షమాభిక్ష కావాలని కోరుతూదాఖలైన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందు వల్ల దోషులకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చుతూ సుప్రీంకోర్టు 2014లో తీర్పు ఇచ్చింది.