జాతీయ వార్తలు

అంగన్‌వాడీల్లోనూ నకిలీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో ఒక కోటి మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నట్లు కేంద్ర మహిళా శిశుసంక్షేమ కనుగొంది. ఈ పేర్లను జాబితాలో నుంచి తొలగించారు. ఈ వివరాలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో 14 లక్షల అంగన్‌వాడీ కేంధ్రాలు ఉన్నారు. వీటి పరిధిలో పది కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. గర్భవతులైన మహిళలు, ఆరు సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు కేంద్రమంద్రి మేనకా గాంధీ చెప్పారు. కోటిమంది లబ్ధిదార్ల పేర్లను గుర్తించి జాబితాలో నుంచి తొలగించామని, సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అస్సాంలోనే అంగన్‌వాడీ పరిధిలో 14 లక్షల మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నట్లు కనుగొన్నామన్నారు. ఈ సర్వేను గత జూన్ నెలలో నిర్వహించామన్నారు. అన్ని రాష్ట్రప్రభుత్వాలు నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందే విధంగా కట్టుదిట్టమైన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంగన్ వాడీ సిబ్బందికి వేతనాలు పెంచాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానాన్ని ఆమె ఆహ్వానించారు. పోషన్ అభియాన్ కార్యక్రమం విశిష్టమైనదని ఆమె చెప్పారు. అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.4500కు పెంచామన్నారు. మినీ అంగన్ వాడీ వర్కర్లకు రూ.2250 నుంచి రూ. 3500కు పెంచామన్నారు. హెల్పర్లకు రూ.1500 నుంచి 2250కు పెంచామన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రెట్టించిన ఉత్సాహంతో అంగన్ వాడీ వర్కర్లు పనిచేసేందుకు వీలవుతుందన్నారు.