జాతీయ వార్తలు

ఐటీ అంటే ఉలుకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఆదాయం పన్ను రిటర్న్స్‌పై ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ధ్వజమెత్తారు. లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోదీని ఉత్సాహంగా ఆలింగనం చేసుకున్న రాహుల్ గాంధీ ఐటి శాఖ తీసుకున్న నిర్ణయంపై ఆమడ దూరం పారిపోయే ధోరణిని అవలంభించడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించి 2011-12 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్‌ను మళ్లీ పరిశీలించాలని ఆదాయం పన్ను శాఖ నిర్ణయించిన విషయం విదితమే. ఈ కేసులో తమకు ఊరట నివ్వాలని కోరుతూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పెట్టుకున్న పిటిషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ ఐటీ రిటర్న్స్ విషయంలో మతలబు ఉంది కాభట్టే రాహుల్ గాంధీ ఆత్మరక్షణలో పడ్డారని ఇరానీ అన్నారు. సాధారణంగా ఐటీ నోటీసును ఎవరూ తప్పుబట్టరని, కాని రాహుల్‌గాంధీ మాత్రం ఐటీ నోటీసును చూసి ఉరుకులుపరుగులు తీస్తున్నారన్నారు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాంరాజన్ పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ ముందు హాజరై బ్యాంకుల్లో పెరిగిన పోతున్న నిరర్థక ఆస్తుల విలువపై వివరణ ఇచ్చారన్నారు. రాజన్ ప్రకటన చూస్తే, ఎన్‌పీఏలు పెరగడానికి పదేళ్ల యూపీఏ పాలన విధానాలే కారణమని విదితమవుతుందన్నారు.
దేశంలో బ్యాంకింగ్ రంగం అప్పుల ఊబిలోకూరుకుపోవడానికి యూపీఏ సర్కార్ అనుసరించిన విధానాలేనని ఆమె ఆరోపించారు. యుపీఏ సర్కార్ వైఫలాలను సరిచేసేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. 2006-08 మధ్య యూపీఏ ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక విధానాల వల్ల బ్యాంకులు విపరీతంగా రుణాలు ఇచ్చాయన్నారు. దీని వల్ల నిరర్థక ఆస్తులు పెరిగాయన్నారు. కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ చేసిన ప్రకటన రుజువు చేసిందన్నారు.