జాతీయ వార్తలు

గెలుపే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 11: రాజస్థాన్‌లో మళ్లీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారం ఇక్కడ పిలుపునిచ్చారు. బిర్లా ఆడిటోరియంలో బీజేపీ స్థానిక సంస్థల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 లోక్‌సభ ఎన్నికలు ఇవి ట్రైలర్‌గా అభివర్ణించారు. బీజేపీ ఘన విజయం సాధించాలన్న కసితో పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘ముఖ్యమంత్రిగా ఎవరు అవుతారు. మంత్రులు అయ్యేదెవరు అనే విషయాన్ని పక్కనబెట్టంది. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే మన అజెండా. దాని కోసం కష్టపడి పనిచేద్దాం’అని అమిత్‌షా స్పష్టం చేశారు. కాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వసుంధరరాజే పేరును బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 50 ఏళ్లు తిరుగుండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో కమలం, భారత్‌మాత గుర్తుతోనే ప్రచారం చేసి విజయం సాధిద్దామని షా పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలు చెబుతున్న మహాకూటమి ప్రభావం అంతంతమాత్రంగా ఉంటుందని ఆయన అన్నారు. యూపీలో మాత్రం కొంత ప్రభావం చూపవచ్చని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వసుంధరరాజే చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. ప్రజల్లో అయోమయం సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.