జాతీయ వార్తలు

పెట్రో కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లు - ఆరుగురు కార్మికులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజ్నార్ (ఉత్తర్‌ప్రదేశ్), సెప్టెంబర్ 12: పెట్రో కెమికల్ పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఆరుగురు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నార్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఈ ఘటనలో మరో కార్మికుడి ఆచూకీ లభించడం లేదు. ఇక్కడి నాగియా రోడ్డులోని మోహిత్ కెమికల్ ఫ్యాక్టరీలో ఇథనాల్‌ను ఉత్పత్తిచేసే బాయిలర్‌లో తలెత్తిన లోపాలను మరమ్మతులు చేస్తుండంగా ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కార్మికులు బల్గోవింద్, రవి, లోకేంద్ర, కమల్‌వీర్, విక్రాంత్, చెత్రం ఘటనా స్థలంలో నే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో పనిచేస్తున్న మరో కార్మికుడి ఆచూకీ తెలియరాలేదని ఎస్పీ ఉమేష్‌కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే గాయపడిన వారికి సరైన వైద్య సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

స్వలింగ సంపర్కంపై నిషేధం ఎత్తివేయాలి
సింగపూర్, సెప్టెంబర్ 12: స్వలింగ సంప్కరంపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని తక్షణం ఎత్తివేయాలని సింగపూర్‌కు చెందిన డిస్క్ జాకీ (డీజే) అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రపంచంలోని అతి పెద్ద దేశాల్లో ఒకటైన భారత్‌లో స్వలింగ సంపర్కం నేరం కాదని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చెందిన డిస్క్ జాకీ (డీజే) అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడని అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. సింగపూర్‌లో డిజిటల్ మార్కెటింగ్ ఏజన్సీని నిర్వహిస్తున్న 43 ఏళ్ల జాన్సన్ ఒంగ్ మింగ్ ఇక్కడ కూడా స్వలింగ సంపర్కంపై ఎంతోకాలం నుంచి ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని 377ఏ సెక్షన్ కింద సింగపూర్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. భారత సుప్రీం స్వలింగ సంపర్కం నేరం కాదని ఇటీవల సంచలన తీర్పు ను వెలువరించిన నేపథ్యంలో మింగ్ సింగపూర్ కోర్టును ఆశ్రయించినట్టు చానెల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.