జాతీయ వార్తలు

కాశీ ఆంధ్రాశ్రమంలో వినాయకచవితి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: వారణాసిలోని శ్రీరామతారకాంధ్రాశ్రమంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం మేనేజింగ్ ట్రసీ వీవీ సుందరశాస్ర్తీ మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవిత ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆశ్రమాన్ని శ్రీరామభద్రేంద్ర సరస్వతి స్థాపించారన్నారు. ఈ ఉత్సవాలను 32 ఏళ్లుగానిర్వహిస్తున్నామన్నారు. పవిత్ర గంగానదీ తీరంలో ఉన్న హిందువుల పుణక్షేత్రం వారణాసికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గణేష్‌విగ్రహానికి మంటపారాధన, నవగ్రహ అష్టదిక్పాలక పూజలు, గణేశ్ అష్టోత్తర శత, సహస్తన్రామ పూజలను ప్రముఖ పురోహితులు శ్యామ శాస్ర్తీ నిర్వహించారు. జానపాటి అప్పేశ్వర శాస్ర్తీ వినాయ ఉత్పత్తి శమంతకోపాఖ్యానం కథ ప్రవచనం చేశారు. శుక్రవారం ఓరుగంటి గురుప్రసాదశర్మ కాశీలో మరణిస్తే కలిగే ముక్తి విషయమై ప్రవచనం చేశారు. ఈ నెల 22వ తేదీన ఉదయం గణపతి హోమం,పూజ, ఉద్వాసనాంతరం గణపతి విగ్రహాన్ని అత్యంత వైభవంగా కాశీ పురవీధుల్లో పాండే హవేలి, భేల్‌పుర, హనుమాన్ ఘాట్, హరిశ్చంద్రఘాట్‌ల మీదుగా ఊరేగింపు చేసి గంగానదిలో నిమజ్జనం చేస్తారు. ఆశ్రమ పాలకవర్గ సభ్యులు సీతారాం, శ్రీమతి ఉమ, శ్రీమతి ధరణితో పాటు తెలుగు రాష్ట్రాల భక్తులు పాల్గొన్నారు.