జాతీయ వార్తలు

బాదల్ కుటుంబాన్ని మతం నుంచి బహిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, సెప్టెంబర్ 14: ఆందోళన కారులపై 2015లో జరిగిన పోలీసు కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన తనయుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌లను మతం నుంచి బహిష్కరించాలని మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ సిక్కుమత అత్యున్నత పీఠం అకల్‌తక్త్‌ను కోరారు. మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన తనయుడు మాజీ ఉప ముఖ్యమంత్రి, సిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ అప్పట్లో అకల్‌తక్త్‌పై వత్తిడి తెచ్చి మతాపచారానికి పాల్పడిన నిందితుడు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్హ్రీమ్ సింగ్‌కు క్షమాభిక్ష వచ్చేలా చేశారని సైతం ఆయన ఆరోపించారు. డేరా వర్గీయుల సానుభూతి ఓట్లు పొందేందుకే వారలా చేశారని సిద్థూ ఆరోపించారు. సిక్కుల అత్యున్నత పీఠం అకల్‌తక్త్ హర్యానాలోని రోహ్‌తక్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌కు క్షమాభిక్ష పెట్టిన అంశం అప్పట్లో వివాదాస్మదమైంది. కాగా సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన బాదల్ కుటుంబాన్ని మతం నుంచి వెలివేయాల్సిందిగా కోరుతూ సిద్ధూ అకల్‌తక్త్ సెక్రటేరియట్‌లో శుక్రవారం ఓ నాలుగు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. ఐదుగురు మతగురువులతో కూడిన అకాలీతక్త్ జతేదార్ నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సునిల్ జఖార్‌తో కలిసి సిద్ధూ విలేఖరులతో మాట్లాడుతూ ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన తనయుడు ఉద్దేశ్యపూర్వకంగానే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులకు ఆదేశాలిచ్చారన్నారు. అందువల్ల బెహబల్ కలాన్ వద్ద ఇద్దరు ఆందోళనకారులు మృతిచెందాని ఆయన గుర్తు చేశారు.
కాగా డేరా కార్యకర్తలు తర్వాత పలు అసాంఘిక చర్యలకు పాల్పడినా వారిని అప్పటి సీఎం, డిప్యూటీ సీఎం సమర్థించారని సిద్ధూ ఆరోపించారు.