జాతీయ వార్తలు

వేతన పెంపుతో 25 లక్షల అంగన్‌వాడీలకు లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం 25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. శనివారం ఆయన ట్వీట్ చేస్తూ ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల వేతనంలో దాదాపు 50 శాతం వేతాలు పెరిగినట్టని ఆయన వెల్లడించారు. ఆశా, అంగన్‌వాడీలు వేతనాల పెంపు దీర్ఘకాలిక డిమాండ్ అని ఆయన చెప్పారు. మోదీ ప్రభుత్వం నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తోందనడానికి వేతనాల పెంపే ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాపై అదనపుభారం పడుతున్నప్పటికీ ఆశా, అంగన్‌వాడీల ఆవేదనను అర్థం చేసుకుని వేతనాలు పెంచినట్టు జైట్లీ తెలిపారు. ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల నెలసరి వేతనాలు పెంచుతున్నట్టు ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. అక్టోబర్ నుంచి పెంచిన గౌరవవేతనాలు నవంబర్ నెల జీతంతో చెల్లిస్తారని ఆయన చెప్పారు. నెలకు మూడువేలు వేతనం తీసుకుంటున్నవారికి 4,500, అలాగే 2,500 రూపాయల నెలవేతనం తీసుకుంటున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు 3,500 రూపాయలు పెంచారు. అంగన్‌వాడీ సహాయకురాలికి 1,500 నుంచి 2,250కు వేతనం పెరుగుతుంది. పనితీరును బట్టి అదనంగా 500 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఇన్‌సెంటీవ్ ఇస్తారు. జాతీయ న్యూట్రిన్ మిషన్‌లో 12.9 లక్షల మంది అంగన్‌వాడీ వర్కర్లు, 11.6 లక్షల మంది సహాయకులు పనిచేస్తున్నట్టు జైట్లీ వెల్లడించారు. వేతనాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 25.9 లక్షల మంది అంగన్‌వాడీలు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విశ్వాసం ఉండేదికాదని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రను తిరగరాసినట్టు సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు.