జాతీయ వార్తలు

సెక్షన్ 498- ఏను దుర్వినియోగం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల కేసుల్లో చట్టం కల్పించిన నిబంధనలను పగ, ప్రతీకారంతో దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో ఐపీసీ 498-ఏ సెక్షన్ కింద నమోదు చేసిన కేసుల్లో వెంటనే అరెస్టులు చేయరాదని తాము ఇచ్చిన ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సెక్షన్‌ను వరకట్న దాహానికి, వేధింపులకు లోనవుతున్న మహిళల సంరక్షణకు ఉద్దేశించారని కోర్టు పేర్కొంది. చట్టాన్ని అడ్డుపెట్టుకుని వేధించే ధోరణిని మానుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్వీకర్, జస్టిస్ డీ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం శనివారం ఐపీస్ సెక్షన్ 498-ఏపై తీర్పు ఇచ్చింది. ఈ కేసుల్లో వెంటనే అరెస్టులు చేయరాదన్న తమ ఆదేశాలను సవరించినట్లు కోర్టు పేర్కొంది. ప్రతి జిల్లాకు ఒక కుటుంబ సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలని గతంలో తాము ఆదేశాలు జారీ చేశామని కోర్టు పేర్కొంది. కుటుంబ సంక్షేమ కమిటీలకు చట్టబద్ధంగా ఎటువంటి పరిధిలేదని కోర్టు పేర్కొంది. ఈ కమిటీలు న్యాయ, చట్టపరిధిలోకి రావని కోర్టు పేర్కొంది. ఈ ఆదేశాలను కూడా తాము సమీక్షించి నిలిపివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. చట్టాలను సమాజ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని, అంతేకాని సంచలనాత్మం చేసుకోరాదని కోర్టు పేర్కొంది. చట్టసభలు సెక్షన్ 498-ఏ నిబంధనలోకి వచ్చే అంశాలను కాగ్నిజబుల్ నేరంగా, నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తాయని కోర్టు పేర్కొది. కాని దర్యాప్తు ఏజన్సీ మాత్రం ముందూ వెనకచూసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాయని కోర్టు పేర్కొంది. ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై వివేచనతో వ్యవహరించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.