జాతీయ వార్తలు

‘రాఫెల్’పై మేము చెప్పింది నిజమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోళ్ల వ్యవహారంలో ప్రజలను తప్పుదోవబట్టించే విధంగా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహారశైలి తయారైందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ అంశంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకస్ హోలాండే తాను భారత్‌ను మోసం చేసినట్లుగా వచ్చిన మీడియా కథనాలపై రాహుల్ తీవ్రంగాస్పందించారు. భారత ప్రభుత్వమే రిలయన్స్ డిఫెన్స్ సంస్థను భాగస్వామిగా చేస్తూ ప్రతిపాదన చేసినట్లు హోలాండే చెప్పారని రాహుల్ తెలిపారు. ప్రధాని స్వయంగా ఈ ఒప్పందంపై మాట్లాడి విధి విధానాలను ఖరారు చేసినట్లు హోలాండే పేర్కొన్నారన్నారు. ఈ విషయమై హోలాండే వాస్తవాలు చెప్పినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి ఎలా చేతులు మారిందో ఇంతకాలం తాము చెబుతున్న వివరాలు వాస్తవమని తేలిందన్నారు. దివాలా తీసిన అనిల్ అంబానీకి రూ.58 వేల కోట్ల రక్షణ కాంట్రాక్టు దక్కడం వెనక మోదీ ప్రమేయం ఉందన్నా రు. మన సైనికుల త్యాగనిరతిని మోసం చేసే విధంగా ప్రధాని వ్యవహరించారన్నారు. 2015 ఏప్రిల్ 10న ప్రధాని మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండేతో మాట్లాడి ఈ ఒప్పందం ఖరారు చేశారన్నారు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు నైపుణ్యం ఉందని, శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాని ఈ ప్రభుత్వ రంగ సంస్థను పక్కనపెట్టి అనిల్ అంబానీ సంస్థకు కాంట్రాక్టును ఖరారు చేయడమేంటన్నారు. ఏరోస్పేస్ రంగంలో ఈ సంస్థకు ఉన్న అర్హతలేమిటని ప్రశ్నించారు. కుట్ర, కుమ్మక్కుతో తనకు కావాల్సిన వారికి ఈ ఒప్పందం దక్కేవిధంగా చేయడంలో ప్రధాని మోదీ సఫలీకృతమయ్యారన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే వ్యాఖ్యలతో మోదీ బండారం బహిర్గతమైందన్నారు.