జాతీయ వార్తలు

ఆ నియామకాలు చెల్లనేరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ద్వారా 2013లో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో జరిగిన 57 పోస్టుల నియామకం చెల్లనేరదని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్య్వూలో 50 శాతం మార్కుల వెయిటేజ్‌ను ఇచ్చారని నిరూపణ కావడం వల్ల ఈ నియామకాలను పక్కన పెట్టాలని పేర్కొంది. మళ్లీ ఈ ప్రక్రియను నిబంధనల మేరకు 15 శాతం వెయిటేజీతో నిర్వహించాలని ఆదేశించింది. నియామకాలు జరిగిన యేడాదే ముఖేష్ కుమార్ సుమన్ అనే వ్యక్తి ఈ పోస్టుల ఎంపికలో అనుసరించిన విధానాలను క్యాట్‌లో సవాలు చేయడంతో సమగ్ర విచారణ అనంతరం శుక్రవారం క్యాట్ ఈ తీర్పును వెలువరించింది. ఇంటర్య్వూలో మార్కుల వెయిటేజీ 15 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలున్నాయని, అయినప్పటికీ ఆ ఆదేశాలను విస్మరించి 50శాతం వెయిటేజీ ఇచ్చారని పిటిషనర్ వాదించారు. రాతపరీక్షలో తనకు నాలువ ర్యాంకు మార్కులు వచ్చినా తనకంటే తక్కువ మార్కులు (45) వచ్చిన వ్యక్తికి వెయిటేజీ కారణంగా మొత్తం మార్కులు అధికంగా వచ్చి ఉద్యోగానికి ఎంపికయ్యారని ఆయన వాపోయారు. ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి సమన్నత సంస్థ ఎంతో ఆదర్శంగా వ్యవహరించాల్సివుంది. అలాంటిది కనీసం నోటిఫికేషన్‌లో కూడా ప్రచురించకుండానే సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం విస్మరించి 50 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వడం ఇలాంటి ఏజెన్సీలకు ఎంతమాత్రం తగద’ని క్యాట్ చైర్మన్ నరసింహారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ ప్రదీప్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాత పరీక్ష, ఇంటర్య్వూలను ఎలా నియమనిబంధనలతో నిర్వహిస్తారో అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయాల్సి ఉందన్న పిటిషనర్ ముఖేష్ కుమార్ సుమన్ అభిప్రాయంతో క్యాట్ ధర్మాసనం ఏకీభవించింది. నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరిగిన 57 పోస్టులను పక్కనపెట్టి మళ్లీ నిబంధనల మేరకు నియామక తతంగాన్ని నిర్వహించాలని క్యాటీ తీర్పులో సూచించింది. ఈ క్రమంలో ఉన్నవారిని ప్రస్తుత పొజిషన్ నుంచి తప్పిస్తే వారిని ప్రస్తుతం ఉన్నటువంటి లేదా తదుపరి వచ్చే ఖాళీల్లోకి సర్దుబాటు చేయాలని ధర్మాసనం సూచించింది.