జాతీయ వార్తలు

ఇకనైనా రామమందిరంపై దృష్టి సారిస్తారా? : శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: సాధ్యమైనంత త్వరలో యూపీలో రామమందిర నిర్మాణాన్ని చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన డిమాండ్‌ను తాము అంగీకరిస్తున్నామని, అయితే దీనివెనుక ఉన్న రాజకీయ నేతలెవరని తాము ప్రశ్నిస్తున్నామని శివసేన పేర్కొంది. శివసేన అదికార పత్రిక సామ్నాలోని ఎడిటోరియల్‌లో బీజేపీ వైఖరిని విమర్శించింది. దేశాన్ని భారతీయ జనతా పార్టీ 50 ఏళ్ల పాటు పాలిస్తుందని ఆ పార్టీ చీఫ్ అమిత్‌షా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని, అదే సమయంలో జమ్మూ, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, రామమందిర నిర్మాణం గురించి ఆయన ఎందుకు మాట్లాడలేకపోతన్నారని శివసేన ప్రశ్నించింది. ఇకనైనా మందిర నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇటీవల జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశంలో ఆ పార్టీ చీఫ్ మోహన్ భగవత్ రామమందిర నిర్మాణ తక్షణ ఆవశ్యకతను ప్రస్తావించారని, దానిని తమ పార్టీ స్వాగతిస్తోందని అన్నారు. అయితే ఆయన ప్రకటన వెనుక ఎవరైనా రాజకీయ నేతల ప్రమేయం ఉందా అని అనుమానం వస్తోందన్నారు. రామమందిర నిర్మాణం కేవలం ఎన్నికల నినాదంగా మారిపోయి హిందుత్వ నినాదాన్ని పరిహాసం చేస్తోందని ఆరోపించింది. అలాగే కాశ్మీర్‌లో బీజేపీ, మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు 370 ఆర్టికల్‌ను కొనసాగిస్తామనో, లేక రద్దు చేస్తామనో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ఆర్టికల్ 370ని కనుక రద్దు చేస్తే అల్లర్లు జరుగుతాయని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రకటన చేశారని, అధికారం కోసం బీజేపీ ఆ పార్టీ (పీడీపీ)తో కల్యాణానికి దిగడం సబబేనా? దానికి రామ్‌మాధవ్ లాంటి సంఘ్ కార్యకర్త రిజ్వీ (పురోహిత) పాత్ర పోషించడం సమంజసమేనా అని ప్రశ్నించింది. గోసంరక్షణ పే రుతో మూకహత్యలు జరుగుతున్నాయన్న విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఖండించిందని, అయితే గోసంరక్షకులు వీధుల్లో చేస్తున్న హత్యలు, దాడులకు ప్రజలంతా సంతోషంగా ఉన్నట్టా అని శివసేన వ్యంగ్యంగా ప్రశ్నించింది.

మాటతప్పుతున్న మోదీ: ప్రవీణ్ తొగాడియా
బాదౌన్ (యూపీ): జమ్మూకాశ్మీర్‌లో 370 ఆర్టికల్ ఉపసంహరణ, అయోధ్యలో రామమంది నిర్మాణం విషయంలో ప్రధాని మోదీ మాట తప్పుతున్నారని, వీటి అమలులో వెనుకంజ వేస్తున్నారని హిందుత్వవాది ప్రవీణ్ తొగాడియా విమర్శించారు. ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రామమందిరాన్ని నిర్మిస్తారని, ఆర్టికల్ 370ని ఉపసంహరిస్తారన్న నమ్మకంతో మోదీని దేశ ప్రజలు ఎన్నుకున్నారని, కాని ఆయన ఆలయానికి బదులుగా మసీదులకు వెళ్తున్నారని విమర్శించారు.