జాతీయ వార్తలు

ఇక చర్చల్లేవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: దుష్ట పాకిస్తాన్‌తో సమావేశాలు, చర్చలు జరపలేమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో భారత, పాకిస్తాన్ దేశాల విదేశీ మంత్రుల మధ్య జరగవలసిన సమావేశం రద్దయింది. పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న ఉగ్రవాదులు గురువారం జమ్ముకాశ్మీర్‌లో ముగ్గురు రాష్ట్ర పోలీసులను హత్య చేయటం, భారతదేశంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించిన ఇస్లామిక్ ఉగ్రవాదులను ప్రశంసిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం పోస్టల్ స్టాంపులు విడుదల చేయడం వంటి సంఘటనలు పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని బైట పెట్టాయని, అందువల్ల భారత, పాకిస్తాన్ దేశాల విదేశీ మంత్రుల మధ్య జరపాలనుకున్న సమావేశం ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రావీష్‌కుమార్ తెలిపారు. జమ్ముకాశ్మీర్‌లో ముగ్గురు పోలీసులను, ఒక బీఎస్‌ఎఫ్ జవానును దారుణంగా చంపటం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధానికి రాసిన లేఖలో రెండు దేశాల విదేశీ మంత్రుల సమావేశం జరపాలనే ప్రతిపాదన చేయటం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు గురువారం ప్రకటించిన ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇస్లామిక్ ఉగ్రవాదులు ముగ్గురు జమ్ముకాశ్మీర్ పోలీసులలను ఎత్తుకుపోయి దారుణంగా హత్య చేశారు. ఉగ్రవాదులు రెండు రోజుల క్రితం ఒక బీఎస్‌ఎఫ్ జవానును దారుణంగా హత్య చేయటంతోపాటు అతని శరీరంతో అగౌరవంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని న్యూయార్క్‌లో రెండు దేశాల విదేశీ మంత్రుల సమావేశం ప్రతిపాదనను తిరస్కరించిందని రావీష్‌కుమార్ వివరించారు. పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు తమకు ఎంతమాత్రం సమ్మతం కాదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ దారికి రాదనేది మరోసారి స్పష్టమైందని ఆయన దుయ్యబట్టారు. పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటనేది మరోసారి నిజమైంది, అందుకే పాకిస్తాన్‌తో సమావేశాలు, చర్చలు సాధ్యం కావని ఆయన ప్రకటించారు. విదేశీ మంత్రుల సమావేశం ప్రతిపాదన వెనక పాకిస్తాన్ దురుద్దేశాలు దాగి ఉన్నాయనేది వెలుగులోకి వచ్చిందని ఆయన దుయ్యబట్టారు.
రాజకీయ రంగు
భారత, పాకిస్తాన్ విదేశీ మంత్రుల సమావేశం ప్రతిపాదన ఆమోదం, తిరస్కారం రాజకీయ రంగు పలుముకున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహించటం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ, సమాజ్‌వాదీ అధికార ప్రతినిధి వర్మ తదితరులు దుయ్యబట్టారు. విదేశీ మంత్రుల సమావేశానికి ఆమోదం తెలిపే ముందు మోదీ ప్రభుత్వం అన్ని అంశాలను లోతుగా పరిశీలించిందా అని వారు ప్రశ్నించారు. సమావేశానికి ఆమోదం తెలపటం ఆ తరువాత ఇరవై నాలుగు గంటల్లో నిర్ణయాన్ని మార్చుకోవటం నరేంద్ర మోదీ ప్రభుత్వం తొందరపాటుకు నిదర్శనమని అన్నారు. పాకిస్తాన్ పట్ల మోదీ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదని వారు ఆరోపించారు.