జాతీయ వార్తలు

మన సైన్యం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: భారత సైన్యం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని, లౌకికవాదానికి ప్రతిరూపంగా నిలవాలని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ అన్నారు. మన సైన్యం సరిహద్దుల వద్ద నిరంతరం భద్రత విధులను నిర్వహిస్తూ గొప్ప త్యాగనిరతితో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. రాజకీయ ఎత్తుగడలకు బలికాకుండా, అంకితభావంతో మన సైన్యం అవిశ్రాంతగా పని చేస్తోందని ఆయన కితాబునిచ్చారు. సర్జికల్ స్రైక్ట్స్‌ను కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న తరుణంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజ్యాంగం వౌలిక సూత్రాల్లో లౌకివాదం బలంగా ఉందని, ఈ మూలాలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థదేనని ఆయన అన్నారు. రాజకీయ వివాదాలు, ఎన్నికల్లో లౌకికవాదం పవిత్రత దెబ్బతినకుండా చూడాలన్నారు. జవాబుదారీతనం లేని రాజకీయ నేతలు, మతతత్వ వాదుల వల్ల రాజ్యాంగ విలువలు మసకబారకుండా న్యాయ వ్యవస్థ గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నేత దివంగత ఏబీ బర్ధన్ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో మతతత్వ వాదులు రాజకీయ స్వప్రయోజనాలతో మతాన్ని వాడుకోకుండా ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించాలన్నారు. ఎన్నికల సమగ్రతను కాపాడాల్సిన నైతిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం లౌకికవాదానికి మచ్చ తెచ్చిందన్నారు. 1992 డిసెంబర్ 6వ తేదీ భారత చరిత్రలో ఒక విషాదమని ఆయన అన్నారు. భారత లౌకికవాద విలువలను భంగం కలిగించేందుకు, దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలు తిప్పిగొట్టాలన్నారు. ఎస్సార్ బొమ్నై కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం రాజ్యాంగ వౌలిక సూత్రాల్లో లౌకికవాదం ప్రధానమైనదని చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.