జాతీయ వార్తలు

సంపన్నులా... మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: సంపన్నవంతులా, మజాకానా. దేశంలో 831 మంది ఐశ్వర్యవంతుల సంపద మొత్తం జీడీపీలోలో నాల్గవ వంతు ఉన్నట్లు సంపదపై అధ్యయనం చేసిన నివేదిక వెల్లడించింది. వీరి సంపద 34 శాతం మేర పెరిగింది. ఒక్కొక్కరు వెయ్యి కోట్ల రూపాయలకు పైబడి ఆదాయం కలిగి ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. జీడీపీలో వీరి సంపద విలువ 719 బిలియన్ డాలర్లు ఉంది.
ఐఎంఎఫ్ సంస్థ 2018 ఏప్రిల్ నెలలో విడుదలచేసిన గణాంక వివరాల ప్రకారం భారత్ జీడీపీ విలువ 2.85 ట్రిలియన్ డాలర్లు. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రూ.3.71 ట్రిలియన్లు కలిగి ఉన్నారు. 2017తో పోల్చితే 2018 నాటికి సంపన్నులు అదనంగా 214 మంది పెరిగారు. ఈ వివరాలను బర్‌క్లేస్ హురున్ ఇండియా రిచ్ పేర్కొంది. ఆక్స్‌ఫామ్ అనే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సంస్థ ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం సమాజంలో అసమానతలు పెరగడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. దేశంలో ఒక శాతం జనాభా వద్ద 73 శాతం సంపద ఉంది. ముంబాయిలో 233 మంది, ఢిల్లీలో 163 మంది, బెంగళూరులో 70 మంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. గత రెండేళ్లలో దేశంలో వెయ్యి కోట్ల రూపాయలు ప్లస్ సంపద కలిగి ఉన్న వారి సంఖ్య రెట్టింపైందని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ జునాయిడ్ తెలిపారు. ఓయో రూమ్స్‌ను నిర్వహిస్తున్న 24 ఏళ్ల రితీష్ అగర్వాల్ నుంచి 95 ఏళ్ల వయస్సు ఉన్న ధరమ్ పాల్ గులాటి వరకు వెయ్యి కోట్లరూపాయలకుపైగా సంపద ఉన్న జాబితాలో ఉన్నారు. అలాగే మహిళల్లో ఈ స్థాయిలో సంపదను ఆర్జించిన వారు 157 శాతం మంది పెరిగారు. 136 మంది మహిళల సంపద వెయ్యి కోట్లరూపాయలకుపైగా సంపాదించారు. ఫార్మా సెక్టార్‌కు చెందిన వారి ఆస్తి ఎక్కువగా ఉంది. మొత్తం సంపన్నుల్లో ఫార్మా రంగానికి చెందిన వారి వాటా 13.7 శాతం. ఆ తర్వాత 7.9 శాతం ఐటీ రంగం, వినిమయ వస్తువులు విక్రయించే వారు 6.4 శాతం మంది ఉన్నారు. దేశం మొత్తంపైన ఒక్క ఏడాదిలో 430 శాతం మేర సంపదను పెంచుకున్న వారిలో కృష్ణ కుమార్ బంగూర్ ఉన్నారు. అతను గ్రాఫైట్ వ్యాపారం చేస్తున్నారు.