జాతీయ వార్తలు

కోహ్లీ, మీరాబాయికి ఖేల్ రత్న అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ చాంపియన్ మీరాబాయి చాను ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే దేశ అత్యున్నత పురస్కారాలైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను అందుకున్నారు. మంగళవారం రాష్టప్రతి భవన్‌లో అత్యంత వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ వివిధ క్రీడల్లో అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన 20 మంది క్రీడాకారులకు జాతీయ పురస్కారాలతోపాటు ఆయా విభాగాలకు చెందిన కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను ప్రదానం చేశారు.
ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన జావెలిన్ త్రోయర్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా, జూనియర్ వరల్డ్ చాంపియన్ స్ప్రింటర్ హిమా దాస్‌తోపాటు 20 మంది ఉత్తమ క్రీడాకారులకు అర్జున అవార్డులను రాష్టప్రతి అందజేశారు. వాస్తవానికి ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆగస్టు 29న హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించాల్సి ఉంది. అయితే, సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జకార్తా, పాలెంబాగ్‌లో జరిగిన 18వ ఆసియా గేమ్స్ నేపథ్యంలో సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు.
ఇదిలావుండగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, సినీ నటి అనుష్క శర్మ, తల్లి సరోజ్ కోహ్లీ, అన్నయ్య వికాస్‌తో కలసి ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యాడు. కాగా, రాజీవ్ ఖేల్ రత్న అందుకున్నవారిలో విరాట్ కోహ్లీ మూడో క్రికెటర్. ఇంతకుముందు క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ (1997-98), మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (2007) అందుకున్నారు. విరాట్ కోహ్లీ 2013లో అర్జున అవార్డు, గత ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అందుకున్న వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈ ఏడాది ప్రథమార్ధంలో పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకుంది. గత ఏడాది జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ అందుకుంది. కాగా, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు 7.5 లక్షలు, అర్జున అవార్డు గ్రహీతలకు 5 లక్షల రూపాయల వంతున అందజేశారు.
ఇదిలావుండగా రాజీవ్ ఖేల్త్న్ర, అర్జున అవార్డులతోపాటు 8 మంది కోచ్‌లకు ద్రోణాచార్యతోపాటు పలువురికి ధ్యాన్ చంద్, టెన్‌జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డులు, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు: విరాట్ కోహ్లీ (క్రికెట్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్).
అర్జున అవార్డు గ్రహీతలు: నీరజ్ చోప్రా, జిన్సన్ జాన్సన్, హిమా దాస్ (అథ్లెటిక్స్), ఎన్.సిక్కిరెడ్డి (బాడ్మింటన్), సతీష్ కుమార్ (బాక్సింగ్), స్మృతి మంధాన (క్రికెట్), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), మన్‌ప్రీత్ సింగ్, సవిత (హాకీ), రవి రాథోడ్ (పోలో), రహీ సర్నోబాత్, అంకుర్ మిట్టల్, శ్రేయసీ సింగ్ (షూటింగ్), మనీకా బాత్రా, జీ.సత్తియన్ (టేబుల్ టెన్నిస్), రోహన్ బోపన్న (టెన్నిస్), సుమీత్ (రెజ్లింగ్), పూజా కదియాన్ (ఉషు), అంకుర్ ధామ (పారా అథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బాడ్మింటన్). మహిళా క్రికెట్ స్మృతి మంధాన ప్రస్తుతం శ్రీలంక టూర్‌లో ఉండడంతో అర్జున అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు.
ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు: సీకే కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఏ.శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్), సుఖ్‌దేవ సింగ్ పన్ను (అథ్లెటిక్స్), క్లారెన్స్ లోబో (హాకీ-లైఫ్‌టైమ్), తారక్ సిన్హా (క్రికెట్-లైఫ్‌టైమ్), జివాన్ కుమార్ శర్మ (జూడో-లైఫ్‌టైమ్), వీఆర్ బీడు (అథ్లెటిక్స్-లైఫ్‌టైమ్).
ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతలు: సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ కుమార్ ఛెత్రీ (హాకీ), బాబీ అలోయిసిస్ (అథ్లెటిక్స్), చౌగాలె దాదు దత్తాత్రేయ (రెజ్లింగ్).