జాతీయ వార్తలు

9మంది వీరప్పన్ అనుచరులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోడ్, సెప్టెంబర్ 25: ప్రముఖ కన్నడ నటుడు, సూపర్‌స్టార్ రాజకుమార్ కిడ్నాప్ కేసు తీర్పు 18 సంవత్సరాల తర్వాత వెలువడింది. రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారన్న ఆరోపణపై తొమ్మిది మంది వీరప్పన్ అనుచరులపై పెట్టిన కేసును గోపిచెట్టిపాళ్యం మూడో అడిషనల్ సెషన్స్ జడ్జి కొట్టివేశారు. వారిపై ఆరోపణలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేనందున కేసును డిస్మిస్ చేసి వారిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్టు జడ్జి మణి తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించి బలమైన సాక్షులను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పేరుమోసిన గంధపు చెక్కల స్మగ్లరు వీరప్పన్, ఆయన అనుచరులు 14మంది తుపాకులతో బెదిరించి కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను తమిళనాడులోని దొడ్డ గ్రామంలో ఉన్న ఆయన ఫాంహౌస్ నుంచి జూలై 30, 2000న కిడ్నాప్ చేశారు. వీరు రాజ్‌కుమార్‌ను తమ చెరలో 100 రోజులకు పైగా ఉంచుకున్నారు. ఆయన కిడ్నాప్‌తో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటమే కాక, రెండింటి మధ్య సంబంధాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. 108 రోజుల తర్వాత వీరప్పన్ ఆయనను విడుదల చేశారు. రాజ్‌కుమార్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరప్పన్, ఆయన అనుచరులపై కేసు నమోదైంది. కాగా, వీరప్పన్, ఆయన అనుచరులు ముగ్గురు 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. అనంతరం ఆయన అనుచరులు తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు తొమ్మిది మందిపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.