జాతీయ వార్తలు

‘రాఫెల్’ వెనుకున్నది మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఫ్రెంచ్ ఆయుధ సంస్థ దస్సాల్ట్ రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి సంబందించిన ఆఫ్‌సెట్ ఒప్పందాన్ని రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థతో చేసుకోవటం వెనక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కపిల్ సిబల్ ఆరోపించారు. నరేంద్ర మోదీ 2015లో ఫ్రాన్స్‌కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు హోలాండ్‌తో రాఫెల్ ఒప్పందం చేసుకోవటం గురించి మన దేశ రక్షణ మంత్రి, వాయుసేనాధ్యక్షుడికి, రక్షణ ఉత్పత్తల సేకరణ కమిటీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి కూడా తెలియదని కపిల్ సిబల్ మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు 124 రాఫెల్ యుద్ధ విమానాలను దస్సాల్ట్ మన దేశంలోని హెచ్‌ఏఎల్‌తో కలిసి ఉత్పత్తి చేయవలసి ఉండింది.. అయితే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఒప్పందాన్ని పూర్తిగా మార్చివేశారని ఆయన తెలిపారు. 34 రాఫెల్ యుద్ధ విమానాలను దిగుమతి చేసుకునేందుకు ఫ్రాన్స్‌తో ప్రభుత్వస్థాయిలో ఒప్పందం చేసుకున్నారు.. ఈ యుద్ధవిమానాలను హెచ్‌ఏఎల్‌కు బదులు రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థ ద్వారా ఉత్పత్తి చేయించేందుకు ఆఫ్‌సెట్ ఒప్పందం చేయించారని కపిల్ సిబల్ ఆరోపించారు. ఈ ఒప్పందం విషయం నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌కు మాత్రమే తెలుసునని ఆయన చెప్పారు. ఈ విషయాలను కోర్టు ముందు పెడితే నరేంద్ర మోదీకి శిక్ష పడటం ఖాయమని అన్నారు. మోదీ అహంకారంతో వ్యవహరిస్తున్నారని కపిల్ సిబల్ విమర్శించారు.