జాతీయ వార్తలు

మాపై బురద చల్లడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, సెప్టెంబర్ 25: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని, దానిపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఎదురుదాడికి దిగారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించి ఆయన నేరుగా ప్రస్తావించకుండా, ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ బురద చల్లే కార్యక్రమానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. అభివృద్ధి వంటి అంశాలపై చర్చించడం కన్నా బురద చల్లడం సులభమని కాంగ్రెస్ పార్టీ గ్రహించిందని, అందుకే ప్రభుత్వం బురద చల్లుతోందని ఆయన ధ్వజమెత్తారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మంగళవారం నిర్వహించిన ఒక ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోపల ఒక బలమయిన కూటమిని ఏర్పాటు చేయడంలో విఫలమయిన కాంగ్రెస్ పార్టీ దేశం వెలుపల నుంచి మద్దతు పొందడానికి చూస్తోందని ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై పాకిస్తాన్ హోంమంత్రి రెహమాన్ మాలిక్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని మోదీ కాంగ్రెస్‌పై ఈ ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ రాఫెల్ ఒప్పందం అంశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే తదుపరి భారత ప్రధానమంత్రి అవుతారని రెహమాన్ మాలిక్ అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ‘అహంకారం’ లోక్‌సభలో 440 సీట్ల నుంచి 44 సీట్లకు తగ్గిందని, అయినప్పటికీ ఆ పార్టీ ఆత్మశోధన చేసుకోవడానికి, చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా లేదని మోదీ అన్నారు. ‘125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఏ స్థితికి దిగజారింది. కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఏమీ మిగిలిలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూడాలంటే మైక్రోస్కోప్‌ను పట్టుకోవలసిన అవసరం ఉంది’ అని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ కూటమి కట్టడానికి చిన్న పార్టీలను బతిమిలాడుకునే దుస్థితికి దిగజారిందని ఆయన ఎద్దేవా చేశారు. ‘ఒకవేళ వారు (కాంగ్రెస్) మిత్రులను సంపాదించినా ఆ కూటమి విజయం సాధించలేదు. అందువల్ల వారు దేశం వెలుపల నుంచి మద్దతు పొందడానికి చూస్తున్నారు.. ఇప్పుడు దేశం బయట ఉన్న వారు భారత ప్రధానమంత్రి ఎవరు అనేదాన్ని నిర్ణయిస్తారా?’ అని మోదీ నిలదీశారు. ప్రభుత్వంపై బురద చల్లడం సులభమని వారు గ్రహించారని, అందువల్ల ఆ పని చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ సభలో ప్రసంగించారు.