జాతీయ వార్తలు

ఇన్ని వేధింపులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపీపై మోదీ సర్కారు కక్షగట్టింది రాజకీయ స్వార్థంతో అబద్ధాలాడుతోంది
కేంద్రం మాటల్లో ఒక్కటీ నిలకడలేదు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారు..
దేశ ప్రజలకు చెప్పేందుకే ఢిల్లీకి వచ్చా కేంద్రంతో దేనిపైనైనా చర్చకు సవాల్
హోదా ఇచ్చేవరకూ పోరు ఆగదు తెలంగాణ, తమిళనాడుతో పేచీల్లేవు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో ఏపీ సర్కారుపై బురద చల్లుతోంది. నన్ను, రాష్ట్రాన్ని వేధింపులకు గురిచేస్తోంది. కేంద్రం బురద చల్లటం రాష్ట్ర ప్రజలకు బాధ కలుగుతోంది’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతోపాటు, నిధులివ్వకుండా రాష్ట్రాన్ని వేధింపులకు గురి చేస్తోందని బాబు ధ్వజమెత్తారు. అవినీతి వైకాపా కోసమే రాష్ట్రాన్ని బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను
వేధింపులకు గురిచేస్తే కేంద్రానికి తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పోలవరం, బడ్జెట్ లోటు, రాజధాని నిర్మాణం కేటాయింపులు తదితర అంశాలపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ‘యూసీలు ఇవ్వలేదంటారు. నిధులిస్తున్నా తీసుకోవటం లేదంటూ తప్పుడు ఆరోపణలు చేస్తారు. యూసీలు పంపిస్తే నిధులు విడుదల చేసి మళ్లీ వాపస్ తీసుకుంటారు. ఏమిటిది?’ అంటూ చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కారు వేధింపులను దేశ ప్రజలకు తెలియచెప్పేందుకే మీతో మాట్లాడాల్సి వస్తోంది అన్నారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తోన్న అన్యాయంపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘రాష్ట్ర పర్యటన సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటున్నాం. విభజన హామీలను పూర్తి చేయాలని కోరుతున్నాం. హామీలు ఏమేరకు అమలయ్యాయనేది సమీక్షించేందుకు కేంద్రం సిద్ధమేనా? అని చంద్రబాబు సవాల్ చేశారు. ఢిల్లీ పర్యటనలో తాను కలుసుకున్న అన్ని రాజకీయ పార్టీలూ తమ డిమాండ్లకు మద్దతు ఇచ్చాయన్నారు. రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను ఎందుకు వాపస్ తీసుకున్నారని అడిగితే, పీఎంవో ఆదేశాల మేరకే చేశామని అనధికారికంగా చెబుతున్నారని చంద్రబాబు ప్రకటించారు. సహకార ఫెడరలిజం అంటే ఇదేనా? అని నిలదీశారు. మోదీ ప్రభుత్వం ఎందుకిలా అబద్ధాలు చెబుతోంది? రాష్ట్రాన్ని ఎందుకు వేధింపులకు గురిచేస్తోందని ప్రశ్నించారు. ‘కేంద్రం ద్వారా విభజన హామీలు అమలు చేయించేందుకు గత నాలుగేళ్లుగా కృషి చేస్తున్నా. 29సార్లు ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీ, ఇతర మంత్రులతో చర్చలు జరిపాను. అయినా రాష్ట్రం పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోంది’ అని చంద్రబాబు ఆరోపించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను పదేళ్లలో పూర్తి చేయాల్సివుండగా, 90శాతం హామీలను నాలుగేళ్లలో పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతోందని ఒక విలేఖరి ప్రశ్నించగా, బడ్జెట్ లోటు ఏ సంవత్సరానిది ఎప్పుడు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? ఈ ప్రశ్నకు కేంద్రం జవాబు చెప్పగలదా? అని సీఎం నిలదీశారు. నిధుల కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు కూటమిని ఏర్పాటు చేస్తారా? అన్న ప్రశ్నకు బాగా పనిచేస్తున్న రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది అని సమాధానమిచ్చారు. జనాభా ఆధారంగా నిధుల కేటాయింపు జరిగితే బాగా పని చేస్తున్న రాష్ట్రాలు కూడా వెనుకబడిపోతాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడుతో ఏపీకి ఎలాంటి గొడవలూ లేవని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ‘ఏపీలో బీజేపీకి రాజకీయంగా ఎలాంటి స్థానం లేదు. అయితే మరో రాజకీయ పార్టీకోసం ఇదంతా చేస్తోంది’ అని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాల సమస్యలను పరిష్కరించటంలో కేంద్రం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి తప్ప, ఇలా వేధింపులకు దిగకూడదని సూచించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి ఏపీకి ఇవ్వకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా సాధించేంతవరకు పోరాటం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు ఎంత దూరమైనా వెళ్తాం’ అని బాబు స్పష్టం చేశారు. మేము ప్రత్యేక హోదా కల్పించాలంటే వారేమో స్పెషల్ పర్పస్ వెహికిల్ అంటున్నారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం ఎన్డీయే నుంచి బైటికిపోయిందన్న బీజేపీ ఆరోపణలను చంద్రబాబు ఖండించారు. తృతీయ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, తాను రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసమే ఢిల్లీకి వచ్చానని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని కూడా అమలుచేయరా? అని ప్రశ్నించారు. మీరు, వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్నారు. ఈ లక్ష్య సాధన కోసం మీరిద్దరూ ఏకమైతే మంచి ఫలితాలు ఉంటాయి కదా? అని ఓ విలేఖరి సూచించగా ప్రత్యేక హోదాకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే వైకాపా, జనసేన హాజరు కాలేదని చెప్పారు. వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? అని చంద్రబాబు నిలదీశారు.
తెలంగాణతో సమస్యలు లేవు
తెలంగాణతో తమకిప్పుడు ఎలాంటి సమస్యలూ లేవు. రాష్ట్ర విభజన జరిగిపోయింది. దానిగురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆధునిక హైదరాబాద్‌ను నిర్మించా. తెలుగు ప్రజల కోసమే చేశాను. వారిప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. విభజన జరిగిపోయింది. దానిగురించి మాట్లాడటం లేదు. విభజన హామీలను అమలు చేయాలంటున్నాం. విభజన మూలంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవలసిన బాధ్యత కేంద్రంపై లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.