అంతర్జాతీయం

రాయబరేలీ బరిలో ప్రియాంక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎన్నికలకు దూరం కావడం మంచిది కాదంటున్న కాంగ్రెస్ సీనియర్లు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోవచ్చు. ఆమె స్థానంలో ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. సోనియా గాంధీ కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నప్పటి నుండి సోనియా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతోపాటు ఇతర కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. సోనియా ప్రతిపక్ష సమావేశాలకు కూడా హాజరుకావటం లేదు. ఆమె అప్పుడప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మిత్రపక్షాల సీనియర్ నాయకులను మాత్రమే కలుసుకుంటున్నారు. దీనికితోడు ఆమె వైద్య పరీక్షలు, చికిత్సకోసం తరచు అమెరికా వెళ్లి వస్తున్నారు. రాయబరేలీ నుండి కూతురు ప్రియాంకా గాంధీని పోటీ చేయించి తాను రాజ్యసభకు రావాలని సోనియా గాంధీ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు కొందరు సీనియర్ నాయకులు మాత్రం సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండటం మంచిది కాదని వాదిస్తున్నట్లు తెలిసింది. సోనియా గాంధీ పోటీ చేయకపోతే దాని ప్రభావం పార్టీ శ్రేణులతోపాటు మిత్రపక్షాలపైనా చూపిస్తుందని పార్టీ సీనియర్ నాయకులు వాదిస్తున్నారు. సోనియా గాంధీ లోక్‌సభకు పోటీ చేయకపోతే ఆమె క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకుంటున్నారనే సందేశం వెళుతుంది. ఇది కాంగ్రెస్‌కు ఎంతమాత్రం మంచిది కాదని పలువురు సీనియర్ నాయకులు చెబుతున్నారు.