జాతీయ వార్తలు

ఆయుధ పోటీ తీవ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 9: భారత ఉపఖండంలో ఆయుధ పోటీ పెరుగుతోంది. భారత్, పాకిస్తాన్‌లు పోటీలుపడి అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. ఫ్రాన్స్‌నుంచి రాఫెల్ ఫైటర్ జెట్స్‌ను, రష్యా నుంచి ఎస్-400 మిసైళ్లను సమకూర్చుకునేందుకు భారత్ ఇప్పటికే ఒప్పందం ఖరారు చేసింది. తాజాగా పాకిస్తాన్ చైనాతో అతి పెద్ద ఆయుధ ఒప్పందం కుదుర్చుకోనుంది. కాని ఈ ఒప్పందం వివరాలు బహిర్గతం కాలేదు. అత్యంత శక్తివంతమైన మిలిటరీ డ్రోన్లను పాకిస్తాన్ సమకూర్చుకోనుంది. ఈ ఒప్పందం విలువ ఇంకా ఖరారు కాలేదు. చైనాలో చెంగ్డూ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రియల్ కంపెనీ వింగ్ లూంగ్-2 అనే అత్యంత ఆధునిక ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్‌ను తయారు చేస్తోంది. చైనా, పాకిస్తాన్ మధ్య మంచి చెలిమి ఉన్న విషయం విదితమే. శక్తివంతమైన సింగిల్ ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను చైనా నుంచి తెప్పించుకునేందుకు పాకిస్తాన్ కసరత్తు చేస్తోంది. రష్యా నుంచి ఎస్-400 మిసైళ్లను తెప్పించుకునేందుకు ఒప్పందం ఖరారు చేసుకునే దిశలో పాకిస్తాన్ మిలిటరీ డ్రోన్లకు ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏరోబాటిక్ టీం డ్రోన్లను సేకించనున్నట్లు పేర్కొంది. ఈ వివరాలను గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించింది. కాగా చైనా నుంచి ఎంత కాలంలో డ్రోన్లను సేకరించాలనే విషయమై స్పష్టత లేదు. పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ కామ్రా, ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పోరేషన్ ఆఫ్ చైనా చెంగ్డూ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రియల్ కంపెనీ సంయుక్తంగా ఈ ద్రోన్లను తయారు చేసే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. వింగ్ లూంగ్-2 డ్రోన్లను చైనా గత ఏడాది ఫిబ్రవరిలో తయారు చేసింది. వీటికి విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తున్నట్లు చైనా వార్తా ఏజన్సీ పేర్కొంది. పాకిస్తాన్-చైనా మధ్య రక్షణ సంబంధాలు బలపడేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. అమెరికాకు చెందిన ఎంక్యు-1 ఎంక్యు-9 డ్రోన్లు టెక్నాలజీపరంగా ఉన్నత శ్రేణికి చెందినవని రక్షణ నిపుణులు పేర్కొన్నారు. కాని వీటిని దేశీయ అవసరాలకు మాత్రమే అమెరికా ఉపయోగించుకుంటుంది.