జాతీయ వార్తలు

పౌరయానానికీ ఉగ్ర ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: పౌర విమానయాన రంగానికీ ఉగ్రవాదం పెను సవాల్‌గా మారిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విమానయాన రంగాన్ని దెబ్బతీయడానికి ఉగ్రవాదులు అనేక సందర్భాల్లో ప్రయత్నించారన్న రాజ్‌నాథ్ పలు ఉదాహరణలు పేర్కొన్నారు. 2009లో ఆమ్‌స్టర్‌డాం-డెట్రాయిట్ విమానం పేల్చివేయడానికి కుట్ర జరిగిందని మంగళవారం ఇక్కడ తెలిపారు. విమానం గగనతలంలో ఉండగానే ఉగ్రదాడికి యత్నం జరిగినట్టు ఆయన చెప్పారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఏ రంగాన్ని నిర్లక్షం చేయకూడదని, భద్రత విషయంలోమరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు పిలుపునిచ్చారు. దేశంలో 40 చిన్న విమానాశ్రయాలు, హెలీపోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. పౌర విమానయాన రంగం అత్యంత సున్నితమైందని ఆయన పేర్కొన్నారు. ఒక్క భారత్ అనే కాదు యావత్ ప్రపంచం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. అంతర్జాతీయ విమానయాన భద్రతపై ఏర్పాటైన సెమినార్‌ను హోమ్‌మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈసెమినార్ రెండు రోజుల పాటు జరుగుతుంది. హోమ్‌మంత్రి తన ప్రసంగంలో వైమానిక రంగంపై జరిగిన దాడుల విషయాన్ని ప్రస్తావించారు. 2001లో షూ బాంబు ఘటన జరిగింది. 2006లో లండన్‌లో ద్రవరూప బాంబును వినియోగించారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో 2009న అండర్‌వేర్ బాంబు ఘటన వెలుచూసింది. వీటన్నింటినీ పరిశీలిస్తే ఉగ్రవాదులు పౌర విమానయాన రంగాన్ని టార్గెట్ చేసుకున్నట్టు అర్థమవుతోందని హోమ్‌మంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలు అన్ని రంగాల్లోకి విస్తరిస్తున్నాయన్న మంత్రి భద్రతాధికారులు మరింత అప్రమత్తంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
2009 క్రిస్మస్ రోజు ఉమర్ ఫరౌక్ అబ్దుల్‌ముతాలబ్ ఓ కార్గో విమానాన్ని కూల్చివేయడానికి యత్నించాడు. అంటర్‌వేర్ బాంబ్ పేల్చేందుకు విఫలయత్నం చేశాడు. పేలుళ్లలో ఉమర్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం గగనతలంలో ఉండగానే ఈ దాడి చోటుచేసుకుందన్న రాజ్‌నాథ్ దురదృష్టవశాత్తూ ఉగ్రవాది ప్రయత్నం విఫలమైందని లేకపోతే పెను ప్రమాదమే జరిగేదని అన్నారు. దేశంలోని 60 విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న సీఐఎస్‌ఎఫ్ ఈ సెమినార్‌ను ఏర్పాటు చేసింది.దీనికి 18 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలు విమానయాన సంస్థలు హాజరవుతున్నాయి. ఉగ్రవాదులు వార్తల్లో ఉండడానికి ప్రయత్నిస్తారని దీనిపై భద్రతాధికారులు ఓ కనే్నయాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. 2001లో అమెరికాలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచానే్న భయకంపితం చేసిందని ఆయన అన్నారు. అన్నిశాఖలూ సమన్వయంతో పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.