జాతీయ వార్తలు

ఆగని వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మీవాళ్లే ఉసిగొల్పుతున్నారు: సీఎం * కల్లోల ప్రాంతాల్లో గస్తీ తీవ్రం
అహ్మదాబాద్, అక్టోబర్ 9: హిందీ మాట్లాడే వలసవాదులపై జరుగుతున్న దాడులపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు ఒకపక్క గుప్పించుకుంటుండగా, మరోపక్క గుజరాత్ రాష్ట్రం నుంచి పలువురు ఇతర రాష్ట్రాలవారు మంగళవారం సైతం అధిక సంఖ్యలో తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్లారు. వలస కార్మికులు అధికంగా నివసించే పారిశ్రామిక ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. శుభర్‌కాంత జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలికపై బిహార్ నుంచి వచ్చిన కార్మికుడు గతనెల 28న అత్యాచారం చేశాడన్న ఆరోపణపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఆరు జిల్లాలకు, ముఖ్యంగా ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో హిందీ మాట్లాడే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై దాడులు ప్రారంభమయ్యాయి. దీంతో వలసవాదులు తమ రాష్ట్రాలకు తరలిపోవడం ప్రారంభించారు. దీనిపై పెద్దయెత్తున విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఇలావుండగా అధికారంలోకి బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ఈ అంశంపై పరస్పర విమర్శలకు దిగాయి. ‘ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారిపై దాడులకు ఉసిగొల్పుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై మొదట ఆ పార్టీ నేత రాహుల్ చర్య తీసుకోగలరా?’ అని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. నిజంగా హింసను రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తన్నట్టయితే ముందు తన కార్యకర్తలపై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గుజరాత్‌లో నివసిస్తున్న వలసవాదులకు సురక్షితంగా జీవించడానికి, వారికి రక్షణ కల్పించడానికి, తమపై పూర్తి నమ్మక కలిగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. అంతకుముందు రాహుల్‌గాంధీ వలసవాదులపై దాడిని ఖండించారు. వారిపై దాడులు చేయడం తప్పని, దానిని తాను పూర్తిగావ్యతిరేకిస్తున్నట్టు ఆయన చెప్పారు. పలు పరిశ్రమలు మూతపడటంతో ఏర్పడిన నిరుద్యోగం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
దాడులకు పాల్పడిన వారిలో అధికులు ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వారని, ఇంతవరకు దాడులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. కాగా, వలసవాదులకు వ్యతిరేకంగా ఠాగూర్ వర్గానికి చెందిన వ్యక్తి చేసిన ప్రసంగం వైరల్ కావడం కూడా ఈ గొడవలకు కారణమైంది. ‘ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వీళ్లు ఈ నేరానికి పాల్పడ్డారు. వారు ఇక్కడకు రావడం వల్లే మారుతి, ఇతర కంపెనీలలో మాకు ఉద్యోగాలు రావడం లేదు. వారు తమ రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సిందే’ అంటూ చేసిన ప్రసంగంతో విద్వేషం మొదలైంది. ఇలావుండగా ఇతర రాష్ట్రాల వ్యక్తులపై దాడులు ప్రారంభం కావడంతో పలువురు కట్టుబట్టలతో తమ రాష్ట్రాలకు ట్రైన్లు, బస్సుల ద్వారా వెళ్లిపోతున్నారు. అధిక సంఖ్యలో వలసవాదులు రావడంతో బస్సు చార్జీలను సైతం పెంచేశారు. వెళ్లిపోతున్న వారు వెళ్లిపోతుండగా, గుజరాత్‌లోనే ఉన్న ఇతర రాష్ట్రాల వారు తీవ్ర భయాందోళనతో గడుపుతున్నారు. ఎప్పుడు తమపై దాడి జరుగుతుందో తెలియడం లేదని వారు పేర్కొంటున్నారు. ఉత్తరభారతీయ వికాస్ పరిషత్ అధ్యక్షుడు శ్యాంసింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రస్తుతం గుజరాత్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఇప్పటివరకు 60 వేల మంది వలసకార్మికులు తమ స్వరాష్ట్రాలకు తరలిపోయారని చెప్పారు. అన్ని పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత వారు తిరిగి గుజరాత్‌కు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.