జాతీయ వార్తలు

మీ అవినీతి.. రెండేళ్ల రాష్ట్ర బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన దినేష్ కుమార్ రాసిన లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని అన్నారు. ఈ లేఖలో ఆయన ఏపీ సీఎస్‌గా ఉన్నప్పుడు కేంద్రం నుంచి వచ్చిన సహాయం గురించి, గతంలోకంటే కేంద్ర పథకాలకు అధికంగా నిధులు వచ్చాయన్న విషయాన్ని ఆ లేఖలో పేర్కొన్నారని వెల్లడించారు. 2016-17 సంవత్సరంలో రాష్ట్రానికి రూ.9,700 కోట్ల నిధులు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విడుదలైనట్టు చెప్పారు. అలాగే 2017-18లో రూ.17,500 కోట్లు రాష్ట్రానికి వచ్చినట్టు చెప్పారు. అయితే ఈ ఏడాది ఆరు నెలల్లో రూ.10,372కోట్లు వచ్చాయని, ఇది కూడా ఏన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాతేనని వివరించారు. ఇంత మొత్తంలో నిధులు వస్తుంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావడం లేదని తెలుగుదేశం పార్టీ బీజేపీపై అసత్య ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. దీనికి తెలుగుదేశం పార్టీ క్షమాపణాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం వివక్ష చూపితే ఇంత మొత్తంలో నిధులు వచ్చేవా? అని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.350 కోట్లపై తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గతంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై యుటిలైజేషన్ సరిఫికెట్లు కేంద్రానికి ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, వాటితోపాటు పూర్తిస్ధాయిలో ఖర్చుల వివరాలను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూసీలు సరైన విధానంలో ఇవ్వకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు వచ్చిందని తెలుగుదేశం పార్టీ డప్పు కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. అదేదో ప్రపంచంలో ఆయనకొక్కడికే వచ్చినట్లు ఆ పార్టీ ప్రచారం చేసుకోంటోందని, గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుతోపాటు దేశంలో చాలామంది ముఖ్యమంత్రులకు వచ్చిందని గుర్తుచేశారు. ఈ అవార్డు ప్రపంచంలో ఎవరికీ రాలేదన్నట్టు కేవలం చంద్రబాబుకే వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు సంపాదించిన డబ్బు రెండేళ్ల రాష్ట్ర బడ్జెట్‌తో సమానమని పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఆదాయపన్ను శాఖ తనిఖీలు ఇంకా జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐటీ దాడులు జరిగిన కంపెనీలు అధికార పార్టీకి చెందిన వారెవరూ కూడా కనీసం బోర్డు సభ్యులుగా కూడా లేనప్పుడు భయవడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఏపీలో అవినీతిపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా సరైన సమయంలో సరైన రీతిలోనే స్పందిస్తారని ఆయన చెప్పారు. అవినీతి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు నువ్వా నేనా అన్న రీతీతో పోటీటిపడుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రతిచోటా అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని జీవీఎల్ ఆరోపించారు.