జాతీయ వార్తలు

జలంధర్‌లో ఉగ్రవాద అనుమానితుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగర్/శ్రీనగర్, అక్టోబర్ 10: కాశ్మీర్, పంజాబ్ పోలీసులు బుధవారం మెరుపుదాడి చేసి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ విద్యార్థులకు అన్సార్ గజ్వాత్ ఉల్ హింద్ అనే కాశ్మీరీ ఉగ్ర వాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను జలంధర్ నగరంలో నిర్వహించారు. సీటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజిమెంట్ అండ్ టెక్నాలజీ కళాశాల హాస్టల్‌లో పోలీసులు సోదాలు నిర్వహించి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను డీజీపీ సురేష్ అరోరా తెపారు. హాస్టల్ గదిలో రెండు ఆయుధాలను, పేలుడు పదార్థ్ధాలను స్వాధీనం చేసుకున్నారు. జహీద్‌గుల్జార్, మహమ్మద్ ఇద్రిస్ షా అలియాస్ ననదీమ్, యూసుఫ్ రఫీక్ భట్‌ను అరెస్టు చేశారు. వీరు బిటెక్ చదువుతున్నారు. వీరంతా కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. కొన్ని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వచ్చిన అభియోగాలను పరిశీలించి గట్టి ఆధారాలతో ఈ దాడులు నిర్వహించినట్లు డీజీపీ చెప్పారు. వీరిపై జలందర్ సదర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ సంస్థ అండదండలతో ఈ విద్యార్థులు జాతివిద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.ఇటీవల పంజాబ్ పోలీసులు పాటియాలాలో కాశ్మీర్‌కు చెందిన అహ్మద్ మాలిక్‌ను పంజాబ్‌పోలీసులు అరెస్టు చేశారు.