జాతీయ వార్తలు

రైల్వే ఉద్యోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దసరా పండుగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేలోని దాదాపు పనె్నండు లక్షల మంది నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు 2017-18 సంవత్సరానికిగాను 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ బోనస్ చెల్లించటం వలన రైల్వే శాఖపై రూ.2044.31కోట్ల భారం పడుతుంది. గరిష్టంగా ప్రతినెలా ఏడు వేల రూపాయల వేతనం పొందుతున్న నాన్‌గెజిటెడ్ ఉద్యోగులందరికీ 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లిస్తారు. నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు గరిష్టంగా రూ.17,951ల బోనస్ లభించే అవకాశం ఉంది. దసరా సెలవులు ప్రారంభమయ్యేలోగా ఈ బోనస్ చెల్లిస్తారు.