జాతీయ వార్తలు

మహిళా ప్రాధాన్య చిత్రాలకు ఆదరణ: కాజోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ‘రాజీ, పద్మావత్, పింక్ వంటి చిత్రాలతో ఇటీవల కాలంలో బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. గొప్ప గొప్ప స్టార్స్ లేకుండానే ఇటీవల విడుదలవుతోన్న కొన్ని చిత్రాలు నిర్మాతలకు కాసుల పంటను పండిస్తున్నాయ కారణం.. ఆ సినిమాలు మహిళా ప్రాధాన్యతతో కూడుకున్నవి కావడమే’ అంటోంది బాలీవుడ్ నటి కాజోల్. ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు కూడా ఆసక్తి కనబరచాలి. అలా చేసినప్పుడే ఎన్నో విజయవంతమైన చిత్రాలు వెలుగు చూస్తాయి. ఈ చిత్రా లు చూడటానికి మహిళలు పోటీలు పడుతూ టికెట్ కోసం క్యూలో నిల్చుంటున్నారు. ఇదే దారిలో మరి న్ని చిత్రాలు రూపొందించడానికి నిర్మాతలు తమ వ్యూహాన్ని పునరాలోచన చేయాలి అని కాజోల్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఈ చిత్రాలు విడుదలై ప్రేక్షకుల ప్రశంసల్ని పొందుతున్నా, విమర్శకుల్ని మెప్పించి మంచి సమీక్షలు వచ్చినా ఇంకా వారిలో నిర్మాణానికి ధైర్యం రావడంలేదు అని పేర్కొన్నారు కాజోల్. మహిళా ప్రాధాన్య చిత్రాలకు నేడు ప్రోత్సాహం ఎంతో అవసరం ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ వున్న చిత్రాలు బాక్సాపీస్ వద్ద భారీగా బోల్తాపడుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి స్టార్స్ లేని చిత్రాలు మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయన్న విషయాన్ని మరచిపోరాదు. ఇలాంటి మహిళా ప్రాధాన్యతో కూడిన చిన్న చిత్రాలైనా మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. అయినా వీటి నిర్మాణం తక్కువ నిష్పత్తిలోనే వుండటం ఆందోళన కలిగించే విషయం అని పేర్కొన్నారు. అయితే నా అభిప్రాయంతో ప్రేక్షకులు ఏకీభవిస్తారని నేను అనుకోవడంలేదు. వారు అన్ని రకాల చిత్రాలు చూడాలనుకుంటారు. అయితే వారు చూడాలనుకుంటున్న చిత్రాల్లో పెద్ద పెద్ద స్టార్స్ వుండాలన్న ఆలోచనేం లేదు. పేరులేని తారలున్నా చిత్రాలు మంచి కథలతో వుంటే చాలు అని, వాటిని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఫలితంగా అలాంటి చిత్రాలకు ఆర్థికంగా, లాభదాయకంగా మారింది అని కాజోల్ పేర్కొంది. కథానాయికను హీరోతో సమానంగా చూడటం లేదని, హీరోలే ప్రాధాన్యంగా చిత్రాలు నిర్మిస్తున్నారని, వాటిపైనే పరిశ్రమ దృష్టి సారిస్తుండటం విచారకరమని అన్నారు. నేడు చాలామంది కథానాయికలు తమ పాత్రల పరిధి, అవి ప్రేక్షకులకు దగ్గరయ్యే విధానంపై దృష్టి సారిస్తూ, అలాంటి పాత్రలను ఎంచుకుంటుండటం మంచి పరిణామంగా కాజోల్ భావిస్తోంది. కాజోల్ తాజాగా నటించిన చిత్రం ‘హెలికాప్టర్ ఈల’ ఈనెల 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో కుటుంబలోని పరిస్థితులు.. చిత్ర ఇతివృత్తం తనను కదిలించిందని పేర్కొంది. ఇద్దరు పిల్లలకు ఒక తల్లిగా తన పాత్ర గురించి కాజోల్ వివరిస్తూ- ‘నేను చేసిన ఇలాంటి పాత్రను గతంలో చాలామంది నటీమణులే పోషించారు. అలాంటి వారికి సైతం నేను పోషించిన ఈ పాత్ర కచ్చితంగా నచ్చితీరుతుందని భావిస్తున్నా. పిల్లల ఫోన్ తనిఖీ చేయడం లేదా వారిని అనుసరించడ కఠినతరమైనేదే అని ప్రతి తల్లిదండ్రులకు అనిపిస్తుంది. అది బిడ్డపై వారికున్న ప్రేమ మాత్రమే. అయితే వారు చేసే పనులను ఇష్టపడకపోవచ్చు. కానీ వాళ్లు ఎల్లప్పుడూ వారినే ప్రేమిస్తారు’ అని చెప్పుకొచ్చింది కాజోల్.