జాతీయ వార్తలు

కడప ఉక్కు పరిశ్రమపై నివేదిక సమర్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కడప ఉక్కు పరిశ్రమ స్థాపనపై ఏర్పాటైన టాస్క్ఫోర్సుకు నివేదికను త్వరగా సమర్పించాలని మెకాన్ సంస్థను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ఆదేశించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన టాస్క్ఫోర్సుతో కేంద్ర ఉక్కు మంత్రిత్వాశాఖ గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత త్వరగా వివరాలను సేకరించాలని మెకాన్ మంత్రి బీరేంద్ర స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే వివరాల కోసం ఎదురుచూడకుండా, మిగిలిన అంశాలతో నివేదిక త్వరగా సమర్పించాలని మెకాన్ సంస్థకు సూచించారు. కడప ప్రాంతంలో ముడి ఇనుము లభ్యత, వౌలిక సాదుపాయలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను నివేదికను తాయారు చేయాలని మంత్రి ఆ సంస్థకు ఆదేశించారు. ప్రభుత్వం లేదా ప్రైవేటు, ఉమ్మడి భాగస్వామ్యంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చించారు.