జాతీయ వార్తలు

ఆంధ్రలో లోక్‌సభ సీట్లు ఇస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలో సీట్ల సర్దుబాటు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలో తమకు కొన్ని సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధినాయకత్వం తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ శాసన సభ ఎన్నికల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధం కావటం తెలిసిందే. తెలంగాణలోని ఆంధ్రుల ఓట్ల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్ 2019 ఏప్రిల్, మేలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమకు కొన్ని లోక్‌సభ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు లేదా సీట్ల సర్దుబాటు కేవలం తెలంగాణ శాసన సభ ఎన్నికలకు పరిమితం కాకూడదని కాంగ్రెస్ అధినాయకత్వం వాదిస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని ఏఐసీసీ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఐదారు సీట్లు కేటాయించవలసి ఉంటుందని కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం అధినాయకత్వానికి స్పష్టం చేశారని అంటున్నారు. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రధానంగా రెండు డిమాండ్లు చేస్తోందన్న వాదన వినిపిస్తున్నది. ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేయాలి, వీలుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఒకే వేదిక పై నుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలి. ఇలా చేయటం వలన తెలంగాణ ప్రజలకు రెండు పార్టీల పొత్తు పట్ల విశ్వాసం కలుగుతుందని వారు చెబుతున్నారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రలో కాంగ్రెస్‌కు ఐదారు లోక్‌సభ సీట్లు కేటాయించాలన్నది రెండో డిమాండ్. కేవలం తెలంగాణ శాసన సభ ఎన్నికల కోసమే రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకోవటం బాగుండదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభు త్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో చేసిందని, ఎన్నో సంస్థలు ఇ చ్చిందని ఏఐసీసీ నాయకులు వాదిస్తున్నారు. యూపీఏ సం కీర్ణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఏదోఒక జాతీయ స్థాయి విద్యా లేదా పరిశోధనా సంస్థ వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని పూర్తిగా ఓడించాలంటే తెలుగుదేశం, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకోవటం మంచిదని కాంగ్రెస్ అధినాయకత్వం వాదిస్తున్నట్లు తెలిసింది. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం కాంగ్రెస్ వాదనతో ఏకీభవించటం లేదని చెబుతున్నారు. తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించటంతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు రెండో స్థానంలో ఉన్నారు, కొన్ని నియోజకవర్గాల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు కాబట్టే సీట్లు డిమాండ్ చేస్తున్నామని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు కాబట్టి వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేయటం సమంజసం కాదని టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.