మెయన్ ఫీచర్

జాతీయ వాదానికి పరీక్షా సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్ సుఖదేవ్ రాజగురు వంటి పంజాబు స్వాతంత్య్రవీరులకు ప్రేరణనిచ్చింది జాతీయవాదం. గురుగోవిందసింగ్, తేజబహదూర్ వంటి వారిని సృష్టించిన భూమి పంజాబ్. వేదవ్యాసునికి జన్మనిచ్చిన ప్రాంతం. పురుషోత్తముని కాలంనుండి విదేశీ దండయాత్రలకు ఎదురొడ్డి నిలిచిన వీరభూమి ఇది. నేడేమయింది?? అమరేందర్‌సింగ్ బ్రార్ కెనడా ఎందుకు వెళ్లినట్లు? అక్కడి సిక్కు యువకులను కలిసి పాకిస్తాన్ వలె ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటుచేసుకునే సమయం వచ్చింది- అని చెప్పటం నిజమేనా? దీన్ని రాహుల్‌గాంధీ సమర్ధిండని అంటున్నారు పంజాబు ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాద ల్- దీనితో రాహుల్‌గాంధీకి కోపం వచ్చిం ది. ‘దేశద్రోహ నేరం నామీద మోపి అరెస్టుచేయండి- ఏమవుతుందో చూడండి’అని బెదిరించటం నేను ఒక టి.వి ఛానల్‌లో చూశాను. పంజాబు భారతీయుల ఖడ్గం. అనాదిగా అక్కడ వేదాలు ప్రవహించాయి. బియాస్ అంటే వ్యాస మహర్షి పంచమవేదం రచించిన ప్రదేశం. నెహ్రూ కుటుంబం పుణ్యమా అని పంచనదులలో నీళ్లకు బదులు రక్తం ప్రవహించింది- 1960వ దశకంలో రాజకీయ లబ్ధికోసం మాస్టర్ తారాసింగ్, సంత్ ఫతేసింగ్ అనే ఇద్దరు రాజకీయ నాయకులను సృష్టించి సిక్కు సముదాయాన్ని విడదీసి పాలించారు. డివైడ్ అండ్ రూల్ అనేది పాశ్చాత్యులు నేర్పిన పాఠం. ఇందిరాగాంధీ రోజుల్లో భింద్రేన్‌వాలా అనే ఒక నిరక్షరకుక్షి ఉండేవాడు. అతడు పవిత్ర అమృతసర్ స్వర్ణ దేవాలయంలో కూర్చొని ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం నడిపాడు. చివరకు అతనిని భద్రతాదళాలు కాల్చిచంపాయి. ఆ కోపంతో ఒక సిక్కు యువకుడు ఇందిరాగాంధీని హత్యచేశాడు.
ఇప్పుడు రాజకీయ లబ్ధికోసం రాహుల్‌గాంధీ మళ్లీ సిక్కు యువతను రెచ్చగొడుతున్నాడు. ఇది న్యాయమా?? రాహుల్‌గాంధీ మీద ఆర్థిక నేరాలు కొన్ని ఉన్నాయి. అమేథీలో సమ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ పేరుతో కొంత భూమి కేటాయించుకున్నాడు. అక్కడ సైకిల్ కంపెనీ బదులు కమర్షియల్ కాంప్లెక్సులు వచ్చాయి. సరిగ్గా హర్యానాలో కూడా ఇలాగే జరిగింది. ఎకరా లక్ష రూపాయలు విలువచేసే ఒక వ్యవసాయ భూమిని కొనుక్కునే నిమిత్తం పేదవాడైన రాబర్ట్‌వద్రా అనే ఒకాయనకు బ్యాంకులు ఎట్టి గ్యారంటీలు లేకుండా ఋణాలు మంజూరుచేశాయి. ఒకే ఒక్క సంవత్సర కాలంలో ఈ వ్యవసాయ భూమి కమర్షియల్ కాంప్లెక్సుల భూమిగా మారిపోయింది. దాని విలువ మూడువందల కోట్లు. ఇది అన్యాయం అంటుం టే అందరికన్నా పెద్ద గొంతుకతో సబూచతుర్వేది రాహుల్ బాబును రాబర్డ్ బాబును సమర్ధిస్తున్నది. ఎందుకని?? ఆ కేసులు కోర్టుకుపోతాయి. నిరాధారమైతే జడ్జీలు కొట్టివేస్తారు. అంతేకాని మామీద కేసులు పెడితే ఏమవుతారో చూడండి అని బెదిరించటం ఏమిటి?
‘అర్థోపురుషఃదాస్యః’ అని ఒక వాక్యం చిన్నప్పుడు విన్నాను. మానవుడు డబ్బుకు దాసోహం అవుతాడు అని దీని అర్థం. ఆర్థిక నేరాలు రాజకీయవేత్తలు తరుచుగా చేస్తుంటారు. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాని కొందరిని ఎందుకు కాపాడుతున్నారు? న్యూఢిల్లీకి 2015, జన వరి 26న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనను సోనియాగాంధీ కలిసి భారతదేశంలో క్రైస్తవులకు రక్షణ లేదు అని చెప్పింది- ఇది దేశద్రోహం కాదా?? తాను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని అబద్ధం చెప్పిం ది- ఎవరూ అంతగా పట్టించుకోలేదు. 2014, ఏప్రిల్ 1 నాడు న్యూఢిల్లీలోని ముస్లిం మత రాజకీయాలు నడిపే అబ్దుల్ బుఖారీ దగ్గరికి వెళ్లి ‘నీవు ముస్లిమ్‌వు, నేను క్రైస్తవురాలిని- అంటే మనం ఇద్దరం సెక్యులరిస్టులం అని అర్థం- కాబట్టి హిందూ మతస్తులను ఓడిద్దాం’ అని అడిగింది- ఇందులో రహస్యం ఏమీలేదు. అన్ని పత్రికలలోనూ వచ్చిన వార్తయే. దీన్ని భారతజాతి ఎలా అర్థంచేసుకోవాలి?? నెహ్రూ పాకిస్తాన్‌ను వెండి పళ్లెంలోపెట్టి మహమ్మద్ ఆలీ జిన్నాకు సమర్పిస్తే ఇప్పుడు రాహుల్‌గాంధీ ఖలీస్తాన్‌ను ఇండియానుండి విడదీయాలని చూస్తున్నారా? షేక్ అబ్దుల్లాకు కాశ్మీర్‌ను అప్పగించింది నెహ్రూగారే. అక్కడ మీరు నేను సరికదా భారత రాష్టప్రతి కూడా ఒక్క అంగుళం స్థలం కొనుక్కునే హక్కు లేదు. దీనినే భారత రాజ్యాంగం 370 అధికరణం బలపరుస్తున్నది. ఆక్రమిత కాశ్మీరును పాకిస్తాన్‌కు అప్పగించినవారు ‘‘దార్శనికులు’’ (విజనరీ) అవుతారా?? ఒకేఒక్క కుటుంబాన్ని రక్షించటంకోసం ఈ దేశ ప్రజలు కొందరు ఎందుకింత తాపత్రయ పడుతున్నారు? సికిందరాబాదులో ఒకాయన సోనియాగాంధీకి మొన్న దేవాలయం కట్టించాడు.
కాశ్మీరులో టూరిజం అభివృద్ధికి నరేంద్రమోడీ భారీ ప్యాకేజీ ప్రకటించారు. ప్యాకేజీలతో సమస్య పరిష్కరంకాదు అని ఒమర్ అబ్దుల్లా బెదిరిస్తున్నాడు. మరి సమస్య ఏమటి? అంటే కాశ్మీరును స్వతంత్ర దేశంగా ప్రకటించటం- ఇటు హిందూస్థాన్ అటు పాకిస్తాన్‌ల మధ్య మేము నలిగిపోతున్నాము అని ఫరూక్ అబ్దుల్లాచేసిన ప్రకటన పాలకులకు గుర్తుండే ఉంటుంది. షేక్‌అబ్దుల్లాగారిని నెహ్రూగారు స్వంత తమ్మునివలె ఆదరించారు. ఫలితంగా కాశ్మీరు రావణాసుర కాష్టం అయింది. సువిశాలమైన భారతదేశాన్ని చిన్నచిన్న ముక్కలు కింద విడగొట్టారు. ఇంకా వీరు సంతృప్తి చెందలేదు. 2015, నవంబర్ 23న మన ఇంటలిజెన్స్ విభాగంవారు అందించిన సమాచారం ప్రకారం భారతదేశంలోని దేశభక్తులను హతమార్చండి అంటూ పాకిస్తాన్ ఐఎస్‌ఐ విభాగంవారు కొందరు ముష్కరులను రహస్యంగా ఇండియాలోకి ప్రవేశపెట్టారు. వీరి సంఖ్య పదిహేను. స్థానిక సిమీ, ఇండియన్ ముజాహిద్దీన్ వంటి తీవ్రవాద సంస్థలతో కలిసి వీరు పనిచేస్తున్నారు. ఇందులో దావూద్ ఇబ్రహీం అనుచరులు కూడా ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెసు పార్టీకి చెందిన మణిశంకర అయ్యర్ కరాచీకి వెళ్లి నరేంద్రమోదీ ప్రభుత్వంనుండి భారత్‌కు విముక్తం కల్పించవలసిన బాధ్యత మీపైన (పాకిస్తాన్) ఉన్నదని పాక్- దునియా టివిలో ప్రసారం నిర్వహించి వచ్చాడు. వీరికి మన సెక్యులర్ పెద్దలు ఏం సమాధానం చెపుతారు? ఐసిస్ ఉగ్రవాద సంస్థ తీవ్రతను అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్‌లు గుర్తించాయి. మాలె దాడులతో చైనాకూడా గ్రహించింది. కాని గ్రహించని దేశం ఒక్క భారత్ మాత్రమే.జాతీయ వాదులకు ఈ దేశంలో గౌరవం లేదు. కొంతకాలంక్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మొయినుద్దీన్ అనే ఉగ్రవాది పట్టుబడ్డాడు. అతడు హైదరాబాద్ పాత బస్తీలోని ఐసిస్ రిక్రూట్‌మెంట్ సెంటర్ వివరాలు వెల్లడించాడు. ఐనాసరే ఎవరూ ఈ అంశాన్ని పట్టించుకోవటం లేదు. ఎందువల్ల? కారణాలేవో తేలికగానే ఊహించవచ్చు. ఇత్తెహాదుల్ మజ్లీస్ రజాకార్ పార్టీకి కోపం తెప్పించటం రాజకీయవేత్తలకు ఇష్టం లేదు.
భారతదేశం నుండి వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరిన వారిలో కొందరు ఇటీవల మరణించారు. వారు 1) మహమ్మద్ ఉమర్‌సుభాన్- శివాజీనగర్ బెంగుళూరు, 2) వౌలానా అబ్దుల్ సుల్తాన్- అల్మారా- కర్ణాటక, 3) షహిం ఫరూకీటస్కీ- కల్యాణ్- మహారాష్ట్ర, 4) ఫియాజ్‌మసూద్- మాన్‌టౌన్- బెంగుళూరు, 5) మహమ్మద్ సాజిత్- అజంనగర్- యు.పి., 6) అతిఫ్‌వాసం మహమ్మద్- మంచిర్యాల, తెలంగా ణ. 2015, ఏప్రిల్ 24న వసీం సోదరుడు అసిఫ్‌కు సిరియాలోని ఐసిస్ హెడ్ క్వార్టర్స్ నుండి ఒక సందేశం వచ్చింది ‘‘సలాం- ఆలేకుం- మీ సోదరుడు దైవ రాజ్యస్థాపనకోసం అసువులు బాసి ఖుదావద్దకు చేరాడు’’. దీనికి సూడో సెక్యులరిస్టులు ఏమి సమాధానం చెపుతారు??
2015, నంవబర్ 23న హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన భవనంలో ఒక బుక్ ఎగ్జిబిషన్ జరిగింది. అందులో అనేక గ్రంథాలతోబాటు తస్లిమా నస్రీన్ రచించిన గ్రంథాలు కూడా అమ్మకానికి పెట్టారు. వాటిని అమ్మకూడదు- అని హైదరాబాదులోని ఎం-బి-టి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నాయకుడు అమ్జద్ ఉల్లాఖాన్ వచ్చి నిర్వాహకులను బెదిరించి ధర్నాచేశారు. కాత్యాయనీవిద్మహే, కన్యకుమారి ధీమహేలు లోగడ రచయితల స్వేచ్ఛకోసం తమ పురస్కారాలు తిరస్కరించారు కదా ఈ సంఘటనకు వారు ఏమి సమాధానం చెపుతారు? అంతేకాదు ఇండియానుండి రిక్రూట్ చేసుకున్న ఐసిస్ ఉగ్రవాదులను సిరియాలో బానిసలుగా ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్న సంగతి వెల్లడి అయింది- ఇంత జరుగుతున్నా ఉగ్రవాదులను ప్రోత్సహించటం మన రాజకీయ వర్గాలు మానుకోలేదు. దేశంలో అసహనం పెరిగిపోయింది అని అమీర్‌ఖాన్ అనే నటుని చేత (24-11-2015) రాహుల్‌గాంధీ అనిపించారు. ఇది నిజమా? నిజంగా హిందూ సమాజంలో అసహనం ఉంటే దిలీప్‌కుమార్ నర్గీస్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, షకీలా, మీనాకుమారి, సైరాబాను, వహీదారహమాన్ వంటివారు బాలీవుడ్‌లో స్థిరపడగలిగేవారా? పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఒక్క హిందూ నటి-నటుడు ఉన్నారా? చెప్పండి చూద్దాం.
హిందువులకు జీహాదీలు, క్రూసేడర్లు మత సహనం బోధించటం ఏమిటి?? శివాజీ సైనికులు ఒక ముస్లిం యువతిని పట్టుకొని శివాజీకి కానుకగా సమర్పించారు. శివాజీ ఆ సైనికులను శిక్షించి ఆమెకు చీరె సారె పెట్టి ఖురాను కానుకగా ఇచ్చి ‘అమ్మా! నీవు నా తల్లివి అయి ఉంటే నేను చాలా అందగాణ్ణి అయి ఉండేవాడిని’ అని ఆమెను వారి కుటుంబానికి అప్పగించాడు. మరి అక్బరు, ఔరంగజేబు, అల్లాఉద్దీన్ ఖిల్జీలు చేసిన దుర్మార్గాలు గుర్తుచేసుకోండి. నరేంద్రమోడీ పాలనలో తమకు రక్షణ లేదు కాబట్టి దేశం వదిలివెళ్లిపోవాలి- అని అమీర్‌ఖాన్ అనే బాలీవుడ్ నటుని భార్య అన్నమాట! (24-11-2015.) ఈయ న పికె అనే సినిమా తీశాడు. అందులో హిందువులకు విధ్వంసకరమైన ఎన్నో సన్నివేశాలున్నాయి. ఐనా నిరసనలు వెల్లివిరియలేదు. అవినీతి కేసులలో ఇరుక్కున్న ఈ షారుఖ్‌ఖాన్‌లు, అమీర్‌ఖాన్‌లు ఇవ్వాళ భారతదేశంలో అసహనం పెరిగిపోయింది అంటున్నారు. నరేంద్రమోదీ నపుంసకుడు అన్నారు సైతాన్ అన్నారు. నరమాంసం తినే పులి అన్నారు వేణీప్రసాద్‌వర్మ- ఇది అసహనం కాదా?? గత అరవై సంవత్సరాలుగా ప్రజాధనాన్ని దోచుకొని తిన్న స్కాముల పాములకు ఇవ్వాళ దేశంలో అసహనం కన్పడుతున్నది. ప్రాథమిక హక్కులను ఇందిరాగాంధీ 1975లో హరించింది. జయప్రకాశ్ నారాయణ్ వంటి మహాపురుషులను జైలులో పెట్టించింది. ఆనాడు దేశంలో అసహనం పెరిగింది అని ఒక్క సూడో సెక్యులరిస్టు అనలేదు. సరికదా ఆమెను భద్రకాళి, మహాశక్తి అని కవిగాయక వందిమాగధ బృందాలు ప్రశంసలు కురిపించారు.
‘‘నేను ప్రియాంక భర్త కావటమే తప్పు అయిందా?’’అని రాబర్ట్‌వాద్రా ప్రశ్నిస్తున్నారు. అక్రమాస్తులు కూడబెట్టటం నేరం. ఈ అన్యాయం ఏమిటి? అని ప్రశ్నించిన ఆనాటి ఐఏఎస్ అధికారి అశోక్‌ఖేమ్కాకు పట్టిన గతి అందరికీ తెలుసు. ఇప్పుడు వాద్రాను అరెస్టుచేస్తే దానిని ఒక సమస్యగా మార్చి అసహనానికి ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రతీక అని దేశవ్యాప్తంగా అల్లర్లు మొదలుపెట్టాలని యుపిఏ భావిస్తున్నది. ఐనా అరెస్టుచేసేది- వదిలిపెట్టేది నరేంద్రమోదీ కాదు- చట్టం- కోర్టు. పార్లమెంటును స్తంభింపజేసిన వారిపై అసహనం ప్రదర్శించవలసిందే? అవినీతిపరుల మీద ఉగ్రవాదుల మీద పురస్కార తిరస్కార వీరుల మీద ఖల్ నాయకుల మీద అసహనం ప్రదర్శింప వలసిందే!!

- ముదిగొండ శివప్రసాద్