కృష్ణ

వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వరుస వాయుగుండాలతో రైతన్న ఉక్కిరిబిక్కిరి
* ఠారెత్తిస్తున్న వాతావరణ శాఖ హెచ్చరికలు
మచిలీపట్నం, నవంబర్ 29: డెల్టా రైతులను ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. ఖరీఫ్ సాగులో పుట్టెడు కష్టాలను దిగమింగుకుని చివరి దశకు వచ్చిన సమయంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు రైతులను కలవరపెడుతున్నాయి. ఇటీవలే రెండు వాయుగుండాలను ఎదుర్కొన్న రైతన్నలు మళ్లీ మరో వాయుగుండాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డెల్టాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఖరీఫ్ సాగుకు ఈ అల్పపీడనం గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా మారింది. ముమ్మరంగా ఖరీఫ్ కోతలు జరుగుతున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 15 రోజుల క్రితం వరుసగా సంభవించిన రెండు వాయుగుండాలు రైతులకు భారీ నష్టాన్ని కలిగించాయి. నిడివి మీదున్న వరిపంట నేలకొరిగిపోయింది. మూడు నాలుగు రోజుల పాటు పంట నీట నానటంతో మొలకలు సైతం వచ్చాయి. అయినా సరే మొక్కవోని దీక్షతో రైతులు నడుం బిగించారు. పంట పొలాల్లోకి చేరిన వర్షపునీటిని బయటకు పంపి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు. సానుకూల పరిస్థితులు ఏర్పడటంతో వరి కోతలకు ఉపక్రమించారు. ప్రస్తుతం జిల్లాలో పెద్దఎత్తున వరి కోతలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో మళ్లీ ఏర్పడిన అల్పపీడనం రైతులు బెంబేలెత్తిస్తోంది. కోతల సమయంలో వర్షాలు పడితే పెద్దఎత్తున పంట నష్టపోయే ప్రమాదం లేకపోలేదని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ కూలీలకు పెద్దఎత్తున కూలి చెల్లించి మరీ కోతలను పూర్తిచేస్తున్నారు. పనల మీదున్న పంటను నూర్చి ధాన్యాన్ని లోగిళ్లకు తరలించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కోతలు ప్రారంభించని రైతులు మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలతో తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. కోతలు కోయాలా..? లేదా..? అనే మీమాంశలో కొట్టుమిట్టాడుతున్నారు.