జాతీయ వార్తలు

భారత నేవీ అధికారిని రక్షించిన సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రంలో చిక్కుకుపోయిన నావీ అధికారి అభిలాష్ టోమీని నావికా సిబ్బంది రక్షించారు. దాదాపు కదలలేని స్థితిలో ఉన్న ఆయనను రక్షించి ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. టోమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తండ్రి తెలియజేశారు. గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో భాగంగా ఎస్.వి ధురియా దేశీయ నౌకలో బయలుదేరిన ఆయన 1900 మైళ్ల దూరంలో ఆయన పడవ ప్రమాదానికి గురైంది. దీంతో తన ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని ఆయన నేవీ అధికారులకు సమాచారం అందించటంతో సిబ్బంది ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నౌకాసిబ్బంది సాయంతో టమీని గుర్తించి సురక్షితంగా తీసుకువచ్చారు.