తెలంగాణ

5 రాష్ట్రాల్లో నరుూంకు వెయ్యికోట్ల ఆస్తులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాజీ నక్సలైటు, గ్యాంగ్‌స్టర్ నరుూంకు 5 రాష్ట్రాల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేరకు ఆస్తులున్నట్టు పోలీసులు జరిపిన సోదాల్లో తేలింది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం నరుూంను హతమార్చిన పోలీసులు ఆ తర్వాత అర్ధరాత్రి వరకూ వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు. నరుూం బంధువులు, అనుచరుల ఇళ్లలో వందల సంఖ్యలో సెల్‌ఫోన్లు, తుపాకులు, తూటాలు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బంగారం లభించింది. అలకాపురి కాలనీలోని నరుూంకు చెందిన ఇంట్లో 2.8 కోట్ల రూపాయల నగదు, కిలో బంగారం, నాలుగు తుపాకులు, వందల సంఖ్యలో తూటాలు, భూములకు సంబంధించిన పత్రాలు లభించాయి. భూ కబ్జాలు, బెదిరింపులు, హత్యలు వంటి నేరాల్లో నరుూంకు సహకరించిన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బంధువులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.