బిజినెస్

పరిశ్రమల శాఖ కమిషనర్‌ను కలిసిన ఎన్‌డిసి ప్రతినిధి బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్‌ను నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (ఎన్‌డిసి) ప్రతినిధి బృందం కలిసి రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, అందుకు అనువైన వాతావరణాన్ని తెలుసుకుంది. సోమవారం కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో రీర్ అడ్మిరల్ డిఎం సుడాన్ నేతృత్వంలోని డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధులు ప్రేమ్‌కుమార్ జా, గ్రూప్ కెప్టెన్ ఫ్రేజర్ జాన్ నికోలోసన్, జాకబ్ జాన్ ముకుందా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాన్ని, కొత్త పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న ప్రోత్సాహకాలను కమిషనర్ వారికి వివరించారు. పెట్టుబడులకు తమ ప్రాంతం ఎంతో అనువైనదని వారికి తెలిపారు.
పారిశ్రామిక వేత్తలకు సింగిల్‌విండో క్లియరెన్స్ ద్వారా అనుమతులన్నీ ఇవ్వడం, నిరంతర విద్యుత్ సరఫరా అందించడం వంటి అంశాలను తెలియజేశారు. తెలంగాణలో పరిశ్రమలకు 1.5 లక్షల ఎకరాల భూమి ఉందని, 2018 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వల్ప కాలిక వీడియో ప్రజంటేషన్‌ను డిఫెన్స్ కాలేజీ ప్రతినిధి బృందానికి ప్రదర్శించారు.