రాష్ట్రీయం

నేదునూరి సంగీత భాండాగారం విశాఖకు మణిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రారంభించిన మంత్రి గంటా
విశాఖపట్నం, డిసెంబర్ 29: విశాఖ బీచ్‌రోడ్డులోని రాజీవ్ స్మృతిభవన్‌లో ఏర్పాటు చేసిన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి స్మారక సంగీత భాండాగారాన్ని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. అంతకు ముందు నేదునూరి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ విశాఖ నగరానికి ఈ సంగీత భాండాగారం ఒక మణిహారమన్నారు. నేదునూరి ఆలపించిన వేలాది కీర్తనలు ఈ భాండాగారంలో అందుబాటులో ఉంటాయన్నారు. సంగీత ప్రియులు ఏది కావాలంటే అది వినేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. ఈ భాండాగారం అతి తక్కువ వ్యవధిలో రూపుదాల్చటం వెనుక మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జివిఎంసి అధికారుల కృషి ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా నేదునూరి కుమారుడు పాణి మాట్లాడుతూ తమ తండ్రికి ఊహించని గౌరవాన్ని దక్కించారంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు, అనకాపల్లి ఎంపి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. (చిత్రం) విశాఖలో ఏర్పాటు చేసిన కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి గంటా శ్రీనివాసరావు, తదితరులు