రాష్ట్రీయం

‘నీట్’పై అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటూ తేల్చని సుప్రీం.. విచారణ ఆరు వారాలు వాయిదా
హైదరాబాద్, నవంబర్ 26: జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీల ప్రవేశానికి నిర్వహించాల్సిన ‘నీట్’ వ్యవహారం తేలకపోవడంతో ఇటు విద్యార్ధులు, అటు తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. జాతీయ స్థాయిలో మెడికల్, డెంటల్ కాలేజీల్లోని పిజి, యుజి సీట్లలో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు -నీట్ నిర్వహించడానికి కేంద్రం సిద్ధపడటంతో చాలా రాష్ట్రాలు తమ అధికారాల్లోకి జోక్యం చేసుకోవడమే అంటూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమిళనాడు, ఆంధ్రా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ సంస్థలు, వ్యక్తులు కలిపి సుప్రీంకోర్టులో 115 పిటీషన్లను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసులను విచారిస్తూ ‘నీట్’ను నిర్వహించే అధికారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేదని తేల్చిచెప్పింది. దాంతో గత ఏడాది నీట్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఈ ఏడాది ‘నీట్’కు బదులు మరో పేరుతో జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు ఎంసిఐ సిద్ధమైంది. ఎంసిఐ చట్టంలోని 32వ నిబంధనలో అధికారాలను వినియోగించుకుంటూ జాతీయ స్థాయిలో అర్హత పరీక్ష నిర్వహించే అధికారం తమకుందని ఎంసిఐ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఇప్పటికే ఎంసిఐ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు పంపించింది. మంత్రిత్వశాఖ అనుమతి రాగానే నీట్ తరహాలోనే జాతీయ ప్రవేశపరీక్షకు ఎంసిఐ సిద్ధమైంది.
అంతకంటే ముందు నీట్‌పై దాఖలైన కేసుల్లో సుప్రీం స్పందనకు కేంద్రం ఎదురుచూస్తోంది. నీట్‌పై దాఖలైన రివ్యూ పిటీషన్ల విచారణను సుప్రీంకోర్టు గురువారం నాడు మరో ఆరువారాలు వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం గురువారం నాడు విచారణను చేపట్టిది. గతంలో నీట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును కొనసాగించాలా లేదా అన్న అంశంపై వాదనలు చేపట్టింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.