శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చంద్రబాబు హయాంలోనే పేదలకు సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌టిఆర్ భవన్‌లో సోమవారం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆధ్వర్యంలో టిడిపి అనుబంధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం 10,314 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకొరకు డిఎస్సీ నిర్వహించి ఫలితాలు విడుదల చేసిందన్నారు. ఎంపిఇఓ పోస్టులు, 6,354 అంగన్‌వాడీ, ఆయాల పోస్టులు 9,654 భర్తీల కోసం ఫలితాలు విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలో సుమారు 26,322 ఉద్యోగాలను భర్తీ చేశామని ఆయన తెలిపారు. ఈనెల 2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సిఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, టిడిపి అధికారంలోకి వచ్చి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని వైఎస్సార్‌సిపి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సిఎం అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 12,53,000లకు తగ్గిపోయారని, దీనినిబట్టి చూస్తే పదవీ విరమణ అయిన అనంతరం ఏ ఉద్యోగం భర్తీ చేయలేదని, చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పదవీకాలాన్ని పెంచినందున ఉద్యోగుల పదవీ విరమణ కాలేదని, అయినా కూడా సిఎం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, దీనిని వైసిపి గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి విమర్శలను తెలుగుయువత, టిఎన్‌ఎస్‌ఎఫ్ అనుబంధ విభాగాలు తిప్పికొట్టాలని, అదే సమయంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో రాబోవు మూడు నెలల కాలంలో అనుబంధ సంఘాలు చేపట్టవలసిన కార్యక్రమాలను రూపొందించారు. ఈనెల 5న బాబూ జగ్జీవన్‌రామ్, 15న అంబేద్కర్ జయంతిని ఎస్సీ, ఎస్టీ విభాగాల ఆధ్వర్యంలో, 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని బిసి విభాగం ఆధ్వర్యంలో, 20న సిఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను తెలుగుయువత ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా టిడిపి అనుబంధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

పిఎస్‌ఎల్‌వి-సి 33 ప్రయోగంపై నేడు షార్‌లో ఎంఆర్‌ఆర్ సమావేశం
సూళ్లూరుపేట, ఏప్రిల్ 4: సతీష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుండి ఈ నెల 28న ప్రయోగించే పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) మంగళవారం జరగనుంది. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్‌ఆర్ చైర్మన్ డాక్టర్ సురేష్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్‌తో పాటు పలువురు శాస్తవ్రేత్తలు పాల్గొననున్నారు. రాకెట్ అనుసంధాన పనులు, ప్రయోగ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి చివరి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఈ నెల 28న మధ్యాహ్నం 12:59గంటలకు రాకెట్ ప్రయోగం జరిపేందుకు సన్నాహం చేస్తున్నట్లు సమాచారం. కాని ఇస్రో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మే నెలలో పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ద్వారా ఒకేసారి 22 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది. దీని ద్వారా మనదేశానికి చెందిన కార్డోశాట్-సి ఉపగ్రహంతో పాటు జర్మనీ, సింగపూర్ తదితర దేశాలకు చెందిన నావో ఉపగ్రహాలను సి 34 రాకెట్ ద్వారా పంపేందుకు శాస్తవ్రేత్తలు సన్నద్ధమవుతున్నారు.