నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. సంధ్యలం దొనరించు సద్విధుల్ గడచిన ధర్మలోపం బగుఁ దడయ కేల
బోధింప వై తని భూసురప్రవరుండు వదరునో బోధింపఁబడి యవజ్ఞ
దగునె నా కిట్లు నిద్రాభంగ మొనరింప నని యల్గునో దీని కల్గెనేని
యలుకయ పడుదుఁ గా కగునె ధర్మక్రియా లోపంబు హృదయంబులో సహింప’
ఆ. నని వినిశ్చితాత్మయై నిజపతిఁబ్రబో ధించె మునియు నిద్ర దేఱి యలిగి
‘యేల నిద్ర జెఱచి తీవు’ నావుడు జరత్కారు విట్టు లనియెఁ గరము వెఱచి

భావం: సంధ్యాకాలంలో చేయవలసిన సత్కర్మలు లోపిస్తే ధర్మభంగం కలుగుంది. ఎందుకు నన్ను మేల్కొల్పవయ్యావు అని జరత్కారుడు కోపిస్తాడో? మేలుకొల్పబడి అవమానంగా భావించి నా కీ విధంగా నిద్రకు ఆటంకం కలిగించటం తగునా అని కోపిస్తాడో! ఒకవేళ మేల్కొల్పినందున కోపిస్తే కోపానే్న భరిస్తాను గాక! ధర్మకార్యానికి లోపం హృదయంలో సైపదగునా? అని నిశ్చయించుకొని జరత్కారువు తన భర్తను మేల్కొల్పింది. జరత్కారుడును మేల్కొని కోపించి ‘నీవు ఎందుకు నా నిద్రాభంగం’ చేశావు అని అనగా జరత్కారువు మిక్కిలి భయపడింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము