నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. సర్వతీర్థ్భాగమనంబు సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుఁగావు
ఎఱుఁగు మెల్లధర్మంబుల కెందు బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు
భావం: తీర్థాలన్నింటినీ సేవించటం వేదాల నన్నింటినీ అధ్యయనం చేయటం సత్యంతో సాటికావు. ధర్మం బాగాతెలిసిన ఋషులు ఎల్లప్పుడు అన్నిధర్మాలకంటె సత్యమే గొప్పదని అంటారు. గృహస్థాశ్రమధర్మాలన్నింటిలో సత్యమే శ్రేష్ఠమని భావం. ‘సత్యమేవేశ్వరో లోకే సత్యేధర్మః ప్రతిష్ఠితః సత్యములాలని సర్వాణి సత్యాన్నాసి పరంపదం’ అని పురాణోక్తి. లోకంలో సత్యమే ఈశ్వరుడు. సత్యంలోనే ధర్మం నిత్యంగా నిలిచి ఉంటుంది. సర్వజగత్తుకూ సత్యమే మూలం. సత్యంకంటె ఉత్తమ పదం మరొకటి లేదు. సత్యమంటే సత్యవాక్కుమనీ నిత్యసత్యమనీ రెండర్థాలున్నాయి. ఆ రెండూ ఈ సందర్భంలో గృహస్థాశ్రమపరంగా అన్వయిస్తాయి.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము