నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. ఏను నీ యింతియును గాని యెఱుఁగ రన్యు
లర్థిఁ గణ్వమహాముని యాశ్రమంబు
నందు గాంధర్వవిధి వివాహమునఁ గరము
నెమ్మిఁ జేసెన దీని పాణిగ్రహణము
భావం: దుష్యంతుడు తాను మరిచిన విషయాన్ని ఆకాశవాణి చేసిన హెచ్చరిక వల్ల తిరిగి జ్ఞప్తికి తెచ్చుకున్నవాడై అలనాడు కోరి కోరి కణ్వమహర్షి ఆశ్రమంలో గాంధర్వవిధి వివాహపద్ధతి నాశ్రయించి ఈమెను మిక్కిలి ప్రీతితో చేసికొన్న వివాహం నాకూ ఈమెకూ తప్ప ఇతరులకెవ్వరికి తెలియదు. కాని ఈనాడు దేవతలు శకుంతల పాతివ్రత్యాన్ని గురించి సత్యాన్ని గురించి భరతుడి పుట్టుకను గురించి మిక్కిలి సంతోషంతో కీర్తించిన విధాన్ని దుష్యంతుని సభలో ఉన్నవారందరూ విన్నందున ఆ సంతోషంతో తనకు శకుంతల కు జరిగిన వివాహ ముచ్చటను సభాసదులతో దుష్యంతుడు చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము