నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. అన్యులెఱుఁగమి ఁ జేసె లోకాపవాద
బీతి నెఱిఁగియు నిత్తన్విఁబ్రీతి దప్పె
యెఱుఁగ నంటిని నిందఱ కిప్పు దెఱుఁగ
జెప్పె నాకాశవాణి యచ్చెరువు గాఁగ
భావం: ఇతరుల కెవ్వరికి తెలియదుకాబట్టి లోకనింద కలుగునేమో అన్న భయంతో నా కీమె తెలిసి ఉన్నప్పటికీ కఠినంగా ‘ఈమె నాకు తెలియదు’ అని అన్నాను. ఇప్పుడు అందరికీ తెలిసేటట్లుగా అద్భుతంగా ఆకాశవాణి ప్రకటించింది. అంటూ ఎంతో సంతోషంతో గుండెల్లో గూడుకట్టుకొని ఉన్న తన ప్రేమోదంతాన్ని సభలో కూర్చున్నవారికి దుష్యంతుడు వెఱుపు లేకుండా చెప్పాడు. శకుంతల మంచితనాన్ని, శకుంతల తల్లిదండ్రుల గొప్పతనాన్ని గురించి సభాసదులకు ఎంతో గొప్పగా చెప్పాడు. అప్పటివరకు శకుంతల మానసికంగా ఎంతో ఆవేదన చెందినా దుష్యంతునికి సభలోని వారికి ఆకాశవాణి తమవృత్తాంతాన్ని చెప్పడంతో ఎంతో సంతోషించింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము