నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అతనికి ననంత పుణ్యా
న్విత యనఁదగు మాద్రవతికి నీ నఖిల జగ
న్నుత జనమేజయ పుట్టితి
ధృతిఁ బాండవవంశమునకు ఁ దేజం బెసఁగన్

భావం: సమస్త లోకాల చేత కీర్తింపబడే జనమేజయుడా! భరతవంశం విచ్ఛేదం అయ్యేస్థితి రాగా దేవరన్యాయం ప్రకారం సత్యవతి ఆనతి మేరకు వ్యాసుడు కౌరవులు , పాండవుల జననానికి కారణం అయ్యాడు. పాండవులల్లో అర్జునునికి సుభద్రకూ జరిగిన వివాహ కారణంగా వారిద్దరికీ అభిమన్యుడు పుట్టాడు. ఆ అభిమన్యుడు ఉత్తర అను కన్యను వివాహం చేసుకొని పరీక్షిత్తు అనబడే పుత్రుణ్ణి పొందాడు. ఆ పరీక్షిత్తుమాద్రవతి అనే కన్యను వివాహం చేసుకొన్నాడు. ఆ మాద్రవతీకి, పరీక్షిత్తుకు పుట్టిన కొడుకే నీవు అని జనమేజయునితో చెప్పారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము