నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. వీరైలులుఁ బౌరవులను
భారతులును గౌరవులును బాండవులు ననన్
వీరులయి పరఁగి రిది నయ పారగ
భవదీయ వంశ పరిపాటి మహిన్
వీరు బలులనీ, పౌరవులనీ, భారతులనీ, కౌరవులనీ, పాండవులనీ పిలువబడుతూ వీరులుగా ప్రసిద్ధి చెందారు. ఓ నయకోవిదుడా ఇది లోకంలో వాసికెక్కిన నీ వంశక్రమం అని జనమేజయునితో వైశంపాయనుడు చెప్పాడు.
క. నరవరుఁడగు శంతనున క
మరనదికిని నట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డెట్ల
య్యిరువురకును బుట్టె ? దీని నెఱిఁగింపు మొగిన్
భావం: ఉత్తముడైన శంతనుడికీ గంగకూ పొతుంత ఏవిధంగా కలిగింది? వారిరువురికీ మహాత్ముడైన భీష్ముడు ఏవిధంగా పుట్టాడు? ఈ వృత్తాంతాన్ని అంతా నాకు తెలుపుము అని జనమేజయ మహారాజు వైశంపాయనుణ్ణి అర్థించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము