నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. దానినెఱిఁగి కమలయోని వానికిఁ గర
మల్గి మర్త్య యోనియందుఁ బుట్టు
మనుచు శాపమిచ్చె నొనరంగ వాఁడును
గరము భీతిఁ గరయుగంబు మొగిచి
భావం: బ్రహ్మదేవుడు ఈ గంగాదేవిని మహాభిషుడు చూడడం చూసాడు. ఆ సందర్భంలో ఆ గంగాదేవి పైన మహాభిషుని పైన కోపం తెచ్చుకొన్న బ్రహ్మ ఆ మహాభిషుడిని మానవ వనితకు పుట్టుమని శాపమిచ్చాడు. ఆ శాపానికి వెరచిన మహాభిషుడు తాను చేసిన పనికి వగచి అమిత భయవిహ్వలుడై రెండు చేతులు బ్రహ్మ ముందు జోడించి నిలుచున్నాడు.
క. అనిమిషలోక వియోగం
మన దుఃఖితు లయి వసిష్ఠ మునివరు శాపం
బున వచ్చువారి వసువుల
నెన మండ్రం గాంచి గంగ యెంతయుఁ బ్రీతిన్
భావం: మహాభిషుని రూపసౌందర్యాలను చూచి మన్మథ బాణాలకు గురియైన గంగాదేవి వ్యాకుల చిత్తంతో స్వర్గలోకం నుంచి తిరిగి మానవలోకానికి వస్తూ దారిలో ... స్వర్గలోకం విడువ వలసి వచ్చినందుకు దుఃఖితులైనవారు, వసిష్ఠ మహాముని శాపంతో భూలోకానికి వస్తున్నవారు అయిన ఎనిమిది మంది వసువులను గంగ మిక్కిలి అప్యాయంగా చూచింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము