నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. మాయం దొక్కొక్కళ్ళతు
రీయాంశముఁ దాల్చి శుభ చరిత్రుం డై దీ
ర్ఘాయుష్యుం డష్టమ వసు
వాయతభుజుఁ డుండు నీకు నాతోద్భ్మవుఁడై
భావం: ఆ గంగాదేవి మాటలను విన్న వసువులు సంతృప్తులై అమ్మా మా ఒక్కొక్కళ్ల నాల్గవ అంశాన్ని ధరించి ఉత్తమ శీలుడై, దీర్గాయువై, విశాల భుజాలు గల అష్టమ వసువు ప్రభాసుడు నీకు కన్నకొడుకై మర్త్యలోకంలో ఉంటాడు. మేమందరూ పుట్టినవెంటనే ఈ శరీరాన్ని విడిచి మా పూర్వ నిజవాసానికి వెళ్తామని చెప్పారు.
క. వీరుఁడు ప్రతీపుఁ డఖిల
క్ష్మారాజ్య సుఖములఁ దనిసి మానుగ గంగా
తీరమునఁ దపము సేయుచు
భారత కులుఁడుండె ధర్మవరుఁడై నిష్ఠన్
భావం: భరతకులంలో పుట్టి వీరుడైన ప్రతీపుడు సమస్త రాజ్యభోగాలను తనివి తీరా అనుభవించి ధర్మపరుడై దీక్ష పట్టి గంగానదీతీరంలో మనోజ్ఞంగా తపస్సు చేస్తూ ఉన్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము