నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. గంగ నిజాంగ దీప్తు జనుదెంచి లతాంగి సంగతో
త్తుంగ పయోధర ద్వితయ తోయరుహానన చారునేత్ర ది
వ్యాంగన యై ప్రతీ పవసుధాధిపు శాల విశాల దక్షిణో
త్వంగమునందు మన్మథ వంశంబున మండె ఁ గరంబు లీలతోన్
భావం: అష్టవసువులను చూచి ఖేదం చెంది వారికి మంచి చేయాలని అనుకొంది గంగాదేవి. తాను కూడా భూలోకంలో విహరించడానికై వస్తూ మహాభిషుని శంతనుడై పుట్తాడు. అపుడు తాను అతనిని పెళ్లాడాలన్న కోరిక తో గంగ ప్రతీపుని దగ్గరకు వచ్చింది.
గంగానది తీవె వంటి మేను కలిగినది, పొందికగా ఎతె్తైన వక్షోజముల జంట కలిగినది, పద్మ ము వంటి ముఖం కలిగినది అయిన దివ్య వనిత రూపం తాల్చి తన శరీర కాంతులు ప్రసరిస్తూ ఉండగా వచ్చి మన్మథ పారవశ్యంతో ప్రతీప మహారాజు యొక్క సువిశాలమైన కుడి తొడ మీద మిక్కిలి విలాసంగా కూర్చున్నది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము