నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. తక్షకుఁడను పన్నగుఁడు ప
రీక్షితుఁగఱచునటె నేఁ డరిందము నతనిన్
రక్షింపఁగఁ బోయెద శుభ
దక్షిణు నా మంత్ర తంత్ర దాక్షిణ్యమునన్
భావం: తక్షకుడనే పాము నేడు పరీక్షిన్మమహారాజును కరుస్తాడట. శత్రువుల నణచేవాడు. శుభప్రదుడు, సమర్థుడు మంచిమనస్సు కలవాడు అయిన ఆ మహారాజును విషాన్ని పోగొట్టటంలో శక్తి ఉన్న నా మంత్ర తంత్ర సామర్థ్యం చేత కాపాడటానికి వెళ్లుతున్నాను.
భూమినంతటిని కాపాడే పరీక్షిత్తును శృంగిశాపం చేత తక్షకుడన్న విషసర్పం వల్ల చనిపోతాడన్న విషయం తెలుసుకొని వెళ్తున్న కశ్యడుడను మునిని అడ్డగించి తక్షకుడు అను విషసర్పము ముసలిబ్రాహ్మణుని రూపంలో వెళ్లి ‘ఓ ముని శ్రేష్టుడా! నీవు ఏం పని మీద ఎక్కడికి వెళుతున్నావు’అని అడిగాడు. దానికని తాను పరీక్షిత్తును కాపాడడానికి వెళ్తున్నాను అని ముసలి బ్రాహ్మణుని వేషంలోని తక్షకునికి కశ్యపుడు అను ముని చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము