నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. అధికపుణ్యమూర్తులైన యయ్యిరువుర
కమరనిభుఁడు కౌరవావ్వయంబు
వెలుఁగు చుండఁ బుట్టె వీరాగ్రగణ్యుండు
నంతతార్థరాయి శంతనుండు
భావం: ప్రతీప మహారాజు గంగను ఉద్దేశించి నీవు వచ్చి నన్ను పెండ్లాదాము అనుకున్నవిషయం విన్నాను. కాని నేను ఏకపత్నీవ్రతుడను. కనుక నేను నిన్ను పెండ్లాడలేను అని చెప్పడమే గాక నీవు వచ్చి నా కుమారులు కూర్చునే తొడపైన కూర్చున్నావు కనుక నాపుత్రుడిని నీవు వివాహం చేసుకో అపుడు నాకు నీవు కోడలిగా రాదగిన దానవు అని చెప్పాడు. అదివిని ఆవిధంగా చేయడానికి గంగ సమ్మతించి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత ప్రతీపుడు తన నిజభార్య యైన సునందాదేవితో ఎన్నోపుణ్యకర్మలు ఆచరించాడు. అమిత పుణ్యదంపతులైన సునందాప్రతీపులకు దేవతలతో తుల్యుడైనవాడు, వీరశ్రేష్ఠుడు , మహాదాత అయిన శంతనుడు కౌరవ వంశం ప్రకాశించగా జన్మించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము